సంతోష్‌లో నన్ను నేను చూసుకున్నా | Nani Talks About Like Share Subscribe Pre Release Event | Sakshi
Sakshi News home page

సంతోష్‌లో నన్ను నేను చూసుకున్నా

Oct 31 2022 5:44 AM | Updated on Oct 31 2022 5:44 AM

Nani Talks About Like Share Subscribe Pre Release Event - Sakshi

వెంకట్, మేర్లపాక గాంధీ, మారుతి, నాని, సంతోష్‌ శోభన్, ఫరియా అబ్దుల్లా

‘‘నేను, సంతోష్‌ శోభన్‌.. ఇంద్రగంటి మోహనకృష్ణగారి స్కూల్‌ నుండే వచ్చాం. ‘గోల్కొండ హైస్కూల్‌’లో సంతోష్‌ నటన చూసి చాలా ఇంప్రెస్‌ అయ్యాను.. పరిణితితో నటించాడు. సంతోష్‌లో నన్ను నేను చూసుకున్నానని అప్పుడే ఇంద్రగంటితో చెప్పాను’’ అని హీరో నాని అన్నారు. సంతోష్‌ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’. వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 4న విడుదలకానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘సంతోష్‌ వరుసగా సినిమాలు చేస్తుండటం హ్యాపీ.. తనకు వరుస విజయాలు రావాలి.

వెంకట్‌ బోయనపల్లిగారితో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది’’ అన్నారు. ‘‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ ఘన విజయం సాధించాలి’’ అన్నారు దర్శకుడు మారుతి. ‘‘నానీగారిని తొలిసారి కలిసినప్పుడు ‘నీలో నన్ను చూసుకున్నాను’ అన్నారు.. ఇప్పటి వరకూ నేను అందుకున్న బెస్ట్‌ కాంప్లిమెంట్‌ అది’’ అన్నారు సంతోష్‌ శోభన్‌. ‘‘మేర్లపాక ఈ సినిమాని బాగా తీశాడు’’ అన్నారు వెంకట్‌ బోయనపల్లి. ‘‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ చాలా వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు మేర్లపాక గాంధీ. ‘‘నేను ఒత్తిడిలో ఉన్నప్పుడు మేర్లపాక గాంధీ సినిమాలే చూస్తాను’’ అన్నారు డైరెక్టర్‌ నందినీ రెడ్డి. ఈ వేడుకలో నటులు బ్రహ్మాజీ, సుదర్శన్, సంగీత దర్శకుడు ప్రవీణ్‌ లక్కరాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement