టాలీవుడ్ నటుడు నందు, యామిని భాస్కర్ జంటగా నటిస్తున్న సినిమా 'సైకో సిద్ధార్థ'.. అడల్ట్ కామెడీతో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు. దర్శకుడు వరుణ్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యామిని భాస్కర్, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రి, మౌనిక వంటి వారు నటిస్తున్నారు. నిర్మాత శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు నందు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. తాజాగా విడుదలైన టీజర్‌ను చూస్తుంటే పూర్తిగా యూత్‌ను టార్గెట్ చేసుకుని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా బూతులతోనే టీజర్‌ను నింపేశారు. డిసెంబర్ 12న థియేటర్స్‌లోకి సైకో సిద్ధార్థ రానున్నాడు.


