సంకాంత్రికి సిద్ధంగా ఉండండి | Nandamuri Kalyan Ram first look from his next with Venkatesh and Anil Ravipudi out | Sakshi
Sakshi News home page

సంకాంత్రికి సిద్ధంగా ఉండండి

Jul 6 2026 4:03 AM | Updated on Jul 6 2026 4:03 AM

Nandamuri Kalyan Ram first look from his next with Venkatesh and Anil Ravipudi out

ఆనందంతో స్టెప్పులేస్తూ, సంప్రదాయబద్ధమైన లుక్‌లో కనిపించారు నందమూరి కల్యాణ్‌ రామ్‌. జూలై 5న ఈ హీరో బర్త్‌డే సందర్భంగా ఈ లుక్‌ని విడుదల చేసింది ‘వెంకీఅనిల్‌5/ఎన్‌కేఆర్‌ఏఆర్‌2’ (వర్కింగ్‌ టైటిల్‌) చిత్రబృందం. వెంకటేష్, కల్యాణ్‌ రామ్‌ కాంబినేషన్‌లో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్, అర్చన, జీ స్టూడియోస్‌ సమర్పణలో సాహు గార పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘‘మంచి వినోదం, హృద యాన్ని హత్తుకునే భావోద్వేగాలతో కుటుంబ కథా చిత్రంగా అనిల్‌ రావిపూడి మార్క్‌తో ఈ చిత్రం రూపొందుతోంది’’ అని యూనిట్‌ పేర్కొంది. కాగా... తన ఫస్ట్‌ లుక్‌ని షేర్‌ చేయడానికి కల్యాణ్‌ రామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ ఆరంభించి, ‘అనిల్‌ రావిపూడి జోన్‌లో ఉండటం ఆనందంగా ఉంటుంది. సంక్రాంతి 2027కి ఒక భారీ ఎంటర్‌టైనర్‌కు సిద్ధంగా ఉండండి’’ అని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement