బాలయ్య ‘వీరసింహారెడ్డి’ నుంచి మరో అప్‌డేట్‌

Nandamuri Balakrishna Veera Simha Reddy 3rd Single Will Be Out On Dec 24th - Sakshi

బాలకృష్ణ, శ్రుతీహాసన్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌ ‘మా బావ మనోభావాల్‌..’ లిరికల్‌ వీడియోను ఈ నెల 24న రిలీజ్‌ చేయనున్నట్లు బుధవారం ప్రకటించి, ఈ పాటలోని పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ స్పెషల్‌ సాంగ్‌లో బాలకృష్ణ, చంద్రికా రవి స్టెప్పులు వేశారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చందు రావిపాటి.

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top