ఎయిట్‌ ప్యాక్‌ కష్టాలు | Nagashourya Is Currently Trying For 8 Packs | Sakshi
Sakshi News home page

ఎయిట్‌ ప్యాక్‌ కష్టాలు

Sep 21 2020 6:02 AM | Updated on Sep 21 2020 6:02 AM

Nagashourya Is Currently Trying For 8 Packs - Sakshi

నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగశౌర్య ఆర్చర్‌గా (విలుకాడు) కనిపించనున్నారు. లాక్‌డౌన్‌తో ఈ చిత్రం షూటింగ్‌కి బ్రేకులు పడ్డాయి. ఇటీవలే హైదరాబాద్‌లో మళ్లీ షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సంతోష్‌ జాగర్లపూడి మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం.

ఈ సన్నివేశాల్లో నాగశౌర్య షర్ట్‌ లేకుండా 8 ప్యాక్‌ బాడీని ప్రదర్శించాల్సి ఉంది. దీంతో ఎయిట్‌ ప్యాక్‌ యాబ్స్‌ పొందడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు శౌర్య. కచ్చితమైన డైట్‌ ఫాలో అవుతుండటంతో పాటు ప్రతి రోజూ జిమ్‌లో చెమట చిందిస్తున్నారు. ఐదు రోజులుగా ఆయన నీళ్లు కూడా తాగడం లేదు. ఆఖరుకి లాలాజలాన్ని కూడా మింగడం లేదంటే ఫిట్‌నెస్‌ కోసం ఆయన ఎంతగా శ్రమిస్తున్నారో అర్థం చేసుకోవాల్సిందే. ఇది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ నిజం’’ అన్నారు. ఈ చిత్రంలో కేతికా శర్మ కథానాయికగా నటిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement