నిన్నిట్టా సూత్తుంటే..  | Nagarjuna Akkineni Naa Saami Ranga first single Yettukelli Povalanipisthunde to release on December 10 | Sakshi
Sakshi News home page

నిన్నిట్టా సూత్తుంటే.. 

Dec 11 2023 3:29 AM | Updated on Dec 11 2023 3:31 AM

Nagarjuna Akkineni Naa Saami Ranga first single Yettukelli Povalanipisthunde to release on December 10 - Sakshi

‘నిన్నిట్టా సూత్తుంటే ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్ల.. ఎత్తుకెల్లిపోవాలనిపిస్తుందే..’ అంటూ హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌ని చూసి పాడేస్తున్నారు హీరో నాగార్జున. విజయ్‌ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున, ఆషికా రంగనాథ్‌ జంటగా నటిస్తున్న ‘నా సామి రంగ’ చిత్రంలోని పాట ఇది. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్ల...’ అంటూ సాగే తొలి పాటని విడుదల చేశారు మేకర్స్‌. ఈ పాటకు చంద్రబోస్‌ సాహిత్యం అందించగా, రామ్‌ మిరియాల పాడారు. ‘‘మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రం ‘నా సామి రంగ’. ఈ సినిమాలో నాగార్జున ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు.

‘ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్ల..’ పాటలో నాగార్జున, ఆషిక కెమిస్ట్రీ అందర్నీ ఆకట్టుకుంటుంది. నాగార్జున హ్యాండ్సమ్‌ లుక్స్, ఆషిక ట్రెడిషనల్‌ గెటప్‌ ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. సంక్రాంతికి విడుదల కానున్న మా సినిమా కుటుంబంతో కలిసి చూసేలా ఉంటుంది’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement