'గుంటూరు కారం' విషయంలో ఫ్యాన్స్‌కు స్ట్రాంగ్‌గా చెప్పిన నాగవంశీ | Sakshi
Sakshi News home page

'గుంటూరు కారం' విషయంలో ఫ్యాన్స్‌కు స్ట్రాంగ్‌గా చెప్పిన నాగవంశీ

Published Sun, Dec 31 2023 5:27 PM

Naga Vamsi Again React On Guntur Kaaram Movie - Sakshi

ఈ సంక్రాంతికి సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.  సుమారు 8 సినిమాలు రేసులో ఉన్నాయి. ఇందులో కొన్ని డబ్బింగ్‌ చిత్రాలు కూడా ఉన్నాయి. ఎన్ని సినిమాలు రేసులో ఉన్నా.. మహేశ్‌ బాబు 'గుంటూరు కారం' చిత్రంపైనే ప్రేక్షకుల గురి ఎక్కువగా ఉంది. మహేశ్‌ బాబు- శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్‌లో త్రవిక్రమ్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మహేశ్‌- త్రివిక్రమ్‌లకు ఇది హ్యాట్రిక్‌ కాంబినేషన్‌ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.  జనవరి 12న గుంటూరు కారం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర  నిర్మాత నాగవంశీ తాజాగా ఒక ట్వీట్‌ చేశారు. 

‘గుంటూరు కారం’ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రతి ఏరియాలో రాజమోళి కలెక్షన్స్‌కు దగ్గరగా వెళ్తామని ఆ ఇంటర్వ్యూ ద్వారా నాగవంశీ తెలిపారు. గుంటూరు కారం సినిమా కంటెంట్‌ విషయంలో తాను ఎంతో నమ్మకంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. అంటే RRR కలెక్షన్స్‌ను బీట్‌ చేయలేకపోయిన వాటికి దగ్గరగా గుంటూరు కారం కలెక్షన్స్‌ ఉంటాయని పరోక్షంగా ఆయన ఇలా చెప్పారు.

ఆ వీడియోతో పాటు ఆయన ఇలా తెలిపారు. 'డియర్‌ సూపర్‌ ఫ్యాన్స్‌.. మీకు మళ్లీ చెబుతున్నా.. మేము అదే మాట మీద ఉన్నాం. 'గుంటూరు కారం' చిత్రాన్ని భారీగా విడుదల చేస్తాం. అంతేకాకుండా ఎక్కువ థియేటర్స్‌లలో రికార్డ్‌ రేంజ్‌లో విడుదల ఉంటుంది. రిలీజ్‌ విషయం మాకు వదిలేయండి. సెలబ్రేషన్స్‌ ఏమాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీదే' అని వంశీ తెలిపారు. తాజాగా 'కుర్చీ మడతపెట్టి' అనే లిరికల్‌ సాంగ్‌ విడుదలైంది. యూట్యూబ్‌తో పాటు సోషల్‌ మీడియాలో ఈ పాట భారీగా వైరల్‌ అవుతుంది. మాస్‌ ప్రేక్షకుల్ని మెప్పించేలా ఉన్న ఈ సాంగ్‌లో మహేశ్‌, శ్రీలీల డ్యాన్స్‌తో దుమ్ములేపారు.

అతడు, ఖలేజా తర్వాత మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్‌ చేయాలని కోరుతూ సోషల్‌ మీడియాలో పలువురు అభిమానులు వరుస ట్వీట్స్‌ చేస్తున్నారు. దీంతో #WeDemandRecordReleaseForGK అనే హ్యాష్‌ట్యాగ్‌ నెట్టింట ట్రెండ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాత నాగవంశీ తాజాగా ఈ ట్వీట్‌ చేయడం విశేషం. దీంతో మహేశ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు.

Advertisement
 
Advertisement