జిమ్‌లో తెగ కష్టపడుతున్న నాగశౌర్య.. ఫోటో వైరల్‌

Naga Shaurya Poses In Gym Looks Macho Photo Viral In Social Media - Sakshi

ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ర్టీలో సత్తా చాటుతున్న యంగ్‌ హీరోల్లో నాగశౌర్య ఒకరు. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్‌ సంపాదిచుకున్నాడు. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించడంతో అతడు వెనుదిరిగి చూసుకోలేదు. వైవిధ్యభరితమైన కథలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇటీవలే హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ అనౌన్స్‌ చేసిన మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020లో నాగశౌర్య 5వ స్థానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ యంగ్‌ హీరో జిమ్‌ వర్కవుట్‌ ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. ఇందులో నాగ శౌర్య మాచో రిప్డ్‌ లుక్‌లో కండలు కండలు తిరిగిన దేహదారుఢ్యంతో కనిపిస్తున్నాడు. ఇక గతంలోనూ లక్ష్య సినిమా కోసం  8 ప్యాక్‌ బాడీతో పాటు పోనీ టెయిల్‌‌‌తో ఉన్న శౌర్య లుక్‌ ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే. పాత్రకు తగ్గట్లు శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు జిమ్‌లో తెగ కసరత్తులే చేస్తున్నాడు నాగశౌర్య. ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో వరుడు కావలెను, లక్ష్య, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి చిత్రాల్లో నటిస్తున్నాడు. 

చదవండి : రెమ్యునరేషన్‌‌ బీభత్సంగా పెంచిన యంగ్‌ హీరో
నితిన్‌ డేరింగ్‌ స్టెప్‌: షూటింగ్‌ మొదలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top