'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఫస్ట్ లుక్ రిలీజ్‌ | Naga Shaurya And Malavika Nair Papa First Look Released | Sakshi
Sakshi News home page

Naga Shaurya: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఫస్ట్ లుక్ రిలీజ్‌

Jan 3 2023 8:40 AM | Updated on Jan 3 2023 8:42 AM

Naga Shaurya And Malavika Nair Papa First Look Released - Sakshi

‘ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద’ వంటి చిత్రాల తర్వాత హీరో నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. నాగశౌర్య, మాళవికా నాయర్‌ జంటగా టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. ఈ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

శ్రీనివాస్‌ అవసరాల మాట్లాడుతూ– ‘‘పదేళ్ల పాటు ఓ జంట మధ్య సాగే ప్రేమ ప్రయాణమే ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. 18 ఏళ్ల నుండి 28 సంవత్సరాల వయస్సు వరకు హెచ్చు తగ్గులతో సాగే వారి ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా విడుదల తేదీతో పాటు మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి.

ఈ చిత్రానికి కెమెరా: సునీల్‌ కుమార్‌ నామ, సంగీతం: కళ్యాణీ మాలిక్, వివేక్‌ సాగర్‌ (కాఫీ ఫై సాంగ్‌), ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుజిత్‌ కుమార్‌ కొల్లి, అసోసియేట్‌ ప్రొడ్యూసర్స్‌: సునీల్‌ షా, రాజా సుబ్రమణియన్, సహనిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement