Naga Chaitanya: సమంతపై ఇప్పటికి గౌరవం ఉంది.. కానీ!

Naga Chaitanya Said He Has a Immense Respect On Ex Wife Samantha Still - Sakshi

టాలీవుడ్‌ మాజీ దంపతులైన నాగ చైతన్య-సమంతల విడాకులు వ్యవహరం ఇప్పటికే హాట్‌టాపిక్‌గానే ఉంది. వీరు విడిపోయిన 10 నెలల గడుస్తున్న చై-సామ్‌ విడాకులు వార్తలు నెట్టింట చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి. విడాకుల ప్రకటన వరకు కూడా ఎంతో అన్యోన్యంగా కనిపించారు. అలాంటి చై-సామ్‌ విడిపోవడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పటికీ వీరి విడాకుల అంశం ఆసక్తిని సంతరించుకుంటోంది. అయితే మొదట్లో విడాకులపై అసలు నోరు విప్పని చై లాల్‌ సింగ్‌ చద్దా ప్రమోషన్స్‌లో ఆసక్తికర కామెంట్స్‌ చేస్తూ వస్తున్నాడు.  తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. సమంతపై తనకు ఇప్పటికీ గౌరవం ఉందని చెప్పుకొచ్చాడు.

చదవండి: మీ మాజీ భర్త షాహిద్‌ అంటూ ప్రశ్న.. కరీనా రియాక్షన్‌ చూశారా?

తాజాగా ఓ బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించిన చైకి సమంత గురించిన ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. విడాకుల గురించి కాకుండ కొత్తగా సమంతపై తన అభిప్రాయం ఏంటని అడిగింది యాంకర్‌. దీనికి చై స్పందిస్తూ.. ‘ సమంత అంటే ఇప్పటికీ నాకు అమితమైన గౌరవం ఉంది. తనపై ఉన్న గౌరవం ఎప్పటికీ పోదు. ఓ అండర్‌స్టాండింగ్‌తోనే మేం విడాకులు ప్రకటన ఇచ్చాం. ఆ సమయంలో కూడా మాకు ఒకరిపై మరోకరికి రెస్పెక్ట్‌ ఉంది. మా మధ్య ఏం జరిగిందో అదే చెప్పాం. కానీ అంతకుమించింది ఏదో మా మధ్య జరిగిందని చెప్పేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రారంభంలో మాత్రం మాపై వస్తున్న వార్తలు చూసి చాలా విసుగు చెందాను’ అని చెప్పుకొచ్చాడు. 

చదవండి: రణ్‌వీర్‌ని ఫాలో అయిన నటి.. టాప్‌లెస్‌ ఫొటోతో రచ్చ

ఆ తర్వాత మరి వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని నిర్వచించడం నేర్చుకున్నారా? అని అడగ్గా... అదే చేస్తున్నాను కాబట్టే ప్రస్తుతం ఇలా ఉన్నానన్నాడు. ‘వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి మధ్య ఒక స్పష్టమైన రేఖను గీయాలి. అప్పుడే ప్రశాంతంగా ఉండగలం. రెండు కలిపి చూడోద్దు. చిత్తశుద్దితో చేసే పని మనల్ని ఎప్పుడు గెలిపిస్తుంది. పుకార్లను పట్టించుకోవద్దు. వార్తలకు వార్తలే సమాధానం ఇస్తాయి. ఇవాళ ఒకటి వస్తే రేపు మరొకటి. కాబట్టి వాటిని పట్టించుకోకుండ మనం ఏం చేయాలనుకుంటున్నామో దానిపై దృష్టి పెట్టి ముందుకు సాగాలి ’ అంటూ వివరించాడు. కాగా సమంత మాత్రం విడాకుల అనంతరం సోషల్‌ మీడియా తరచూ పోస్ట్స్‌, కోట్స్‌ షేర్‌ చేస్తూ పరోక్షంగా డైవర్స్‌ గురించి ఏదోకటి చెబుతూ చైని విమర్శించిన సంగతి తెలిసిందే.

చదవండి: స్టార్‌ హీరోకి ఇల్లు అమ్మేసిన జాన్వీ? ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top