Naga Chaitanya Dating Rumors With Sobhita Dhulipala And Divyansha Kaushik, Details Inside - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: చైతూ డేటింగ్‌ గాసిప్స్‌.. అప్పుడు ‘మజిలీ’ బ్యూటీ.. ఇప్పుడు ‘మేజర్‌’ భామ

Jun 22 2022 1:59 PM | Updated on Jun 22 2022 3:37 PM

Naga Chaitanya Dating Rumors With Sobhita Dhulipala And Divyansha Kaushik - Sakshi

నాగ చైతన్య వరుస  సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన కేవలం కేరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టాడు. అయితే తన ఫోకస్ను డిస్ట్రాక్ట్ చేసే విధంగా తరచూ తన పర్సనల్ లైఫ్పై రూమర్స్ పుట్టుకొస్తున్నాయి.ఒకసారి ఒక హీరోయిన్తో డేటింగ్ అంటే.. మరోసారి మరో కథానాయికతో పెళ్లంటూ చైతూని రూమర్స్ ఇబ్బంది పెడుతున్నాయి.

శోభిత ధూళిపాళ(గూఢచారి, మేజర్‌ ఫేం)తో నాగచైతన్య డేటింగ్‌ చేస్తున్నాడనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. వీరిద్దరు ప్రస్తుతం డీప్‌ లవ్‌లో ఉన్నారని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. అంతే కాదు గత నెల శోభిత బర్త్ డేను చై గ్రాండ్ గా నిర్వహించాడట. ఇలా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ రూమర్ స్టోరీలో నిజమెంత అనేది తెలియాలంటే చై నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. 

(చదవండి:  ఆ హీరోయిన్‌తో నాగచైతన్య డేటింగ్‌.. స్పందించిన సమంత, ట్వీట్‌ వైరల్‌)

గతంలో కూడా చైపై ఇలాంటి పుకార్లు చాలానే వచ్చాయి. శోభిత కంటే ముందు మజిలీ సెకండ్‌ హీరోయిన్‌ దివ్యాంశ కౌశిక్‌తో చై ప్రేమలో పడ్డాడనే వార్తలు వినిపించాయి. అంతేకాదు వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ఆ మధ్య బాగా ప్రచారం జరిగింది. అయితే చైతూ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు.

ఆయన నటించిన థ్యాంక్యూ, లాల్‌ సింగ్‌ చద్దా చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. త్వరలోనే సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్‌తో సినిమా మూవీ స్టార్ట్ చేయనున్నాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా బొమ్మరిల్లు భాస్కర్ కూడా నాగ చైతన్యను స్టోరీ వినిపించినట్లు వార్తలు వినిపించాయి. ఇలా కేరీర్‌ పరంగా ఫుల్‌ బిజీగా ఉన్న చైతూ.. ఇప్పటికిప్పుడు మళ్లీ న్యూ రిలేషన్‌ను స్టార్ట్‌ చేయడం అంత ఈజీ కాదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement