మరో ముందడుగు  | Sakshi
Sakshi News home page

మరో ముందడుగు 

Published Tue, Feb 6 2024 12:02 AM

Naga Chaitanya Akkineni and Sai Pallavi Combo Thandel Movie Latest Updates - Sakshi

ఆగేదే లేదన్నట్లుగా ‘తండేల్‌’ చిత్రం షూటింగ్‌ నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. ‘లవ్‌స్టోరీ’ చిత్రం తర్వాత హీరో నాగచైతన్య, హీరోయిన్‌ సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్‌’. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్‌ చందూ మొండేటి. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తు న్నారు. ఈ చిత్రంలో జాలరి రాజు పాత్రలో నటిస్తున్నారు నాగచైతన్య.

రాజు మనసు గెలుచుకున్న అమ్మాయి పాత్రలో సాయిపల్లవి కనిపిస్తారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. హైదరాబాద్, కర్ణాటక, ఉడిపి, గోకర్ణి లొకేషన్స్‌లో షూటింగ్స్‌ను పూర్తి చేశారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో కీలక షెడ్యూల్‌ చిత్రీకరణను పూర్తి చేసినట్లు వెల్లడించి, ఈ సినిమా వర్కింగ్‌ స్టిల్స్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ‘‘రాజు పాత్ర కోసం నాగచైతన్య అద్భుతంగా మేకోవర్‌ అయ్యారు. సాయిపల్లవి సహజ సిద్ధంగా కనిపిస్తారు’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement