Niharika Marriage: NagaBabu Emotional Tweet On Niharika Wedding - Sakshi
Sakshi News home page

కాలమే నిర్ణయిస్తుంది.. నాగబాబు భావోద్వేగం

Dec 9 2020 7:34 PM | Updated on Dec 10 2020 10:45 AM

Naga Babu Emotional Tweet Daughter Niharika Wedding - Sakshi

ఇంకెన్నాళ్లు ఇలాంటి ఫీలింగ్‌ ఉంటుందో.. కాలమే నిర్ణయిస్తుంది.. నిన్ను ఎంతగానో మిస్సవుతున్నా నిహా తల్లి

హైదరాబాద్‌: ‘‘సరికొత్త జీవితం ఆరంభించబోతున్న నీకు శుభాకాంక్షలు. తను స్కూలుకు వెళ్లిన మొదటి రోజు నాకింకా గుర్తుంది. అప్పుడైతే సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చేది. కానీ ఇప్పుడలా కాదు. నా చిన్నారి కూతురు స్కూలుకు వెళ్లేంత పెద్దదై పోయిందనే నిజం నమ్మడానికే నాకు చాలా ఏళ్లు పట్టింది. తనతో ఇరవై నాలుగు గంటలు ఆడుకోలేననే బాధ వెంటాడేది. ఇంకెన్నాళ్లు ఇలాంటి ఫీలింగ్‌ ఉంటుందో.. కాలమే నిర్ణయిస్తుంది.. నిన్ను ఎంతగానో మిస్సవుతున్నా నిహా తల్లి’’ అంటూ నటుడు నాగబాబు భావోద్వేగానికి లోనయ్యారు. కూతురిని అత్తారింటికి సాగనంపే సమయం ఆసన్నం కావడంతో పాత జ్ఞాపకాలు తలచుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు. తన గారాలపట్టి నిహారిక పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను మెగా బ్రదర్‌ బుధవారం సోషల్‌ మీడియా‌లో షేర్‌ చేశారు. కాగా నాగబాబు కూతురుగానే గాకుండా నటిగా నిహారిక తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే.(చదవండివధువుగా ముస్తాబైన నిహారిక.. ఫోటో వైరల్‌)

(వైభవంగా నిహారిక-చైతన్య వివాహం గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

అంతేగాక తండ్రి బాటలో నడుస్తూ నిర్మాతగా పలు వెబ్‌ సిరీస్‌లు రూపొందించారు. ఇక నాన్నకూచి అయిన నిహారిక నేడు చైతన్య జొన్నలగడ్డతో ఏడడుగులు వేసి వైవాహిక బంధంలో అడుగుపెట్టనున్నారు. మెగా కుటుంబం, అత్యంత సన్నిహితుల మధ్య వీరిద్దరి వివాహం ఉద​య్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. నిహారిక- చైతన్య పెళ్లి వేడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement