కమలహాసన్‌తో నడిగర్‌ సంఘ నాయకుల భేటీ  | Nadigar Sangam Members Meets Kamal Haasan | Sakshi
Sakshi News home page

కమలహాసన్‌తో నడిగర్‌ సంఘ నాయకుల భేటీ 

May 4 2022 8:53 AM | Updated on May 4 2022 8:53 AM

Nadigar Sangam Members Meets Kamal Haasan - Sakshi

గత మూడేళ్ల క్రితం వివాదాల మధ్య జరిగిన ఈ సంఘం ఎన్నికల ఫలితాలను చెన్నై హైకోర్టు ఆదేశాలతో ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.

సాక్షి, చెన్నై: నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ను దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం (నడిగర్‌ సంఘం) నాయకులు సోమవారం స్థానిక ఆళ్వార్‌పేటలో ని ఆయన కార్యాలయంలో సమావేశమయ్యారు. గత మూడేళ్ల క్రితం వివాదాల మధ్య జరిగిన ఈ సంఘం ఎన్నికల ఫలితాలను చెన్నై హైకోర్టు ఆదేశాలతో ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలుపొందిన పాండవర్‌ జట్టు.. తమ సంఘం ట్రస్టీ సభ్యుడిగా కమలహాసన్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

దీంతో సోమవారం సంఘం అధ్యక్షుడు నాజర్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షుడు కరుణాస్‌ మర్యాదపూర్వకంగా కమలహాసన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు కమలహాసన్‌ను సంఘం ట్రస్టీ సభ్యునిగా బాధ్యతలు చేపట్టాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అందుకు కమలహాసన్‌ కూడా అంగీకరించినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటన లో నటీనటుల సంఘం నాయకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement