RRR Movie: ఆస్కార్ మనదే, ఇంటికి తెచ్చేస్తున్నాం: రామ్‌చరణ్

ఎంతగానో ఎదురుచూస్తున్న భారతీయుల కలను నిజం చేస్తూ ఆస్కార్ అవార్డు గెలిచింది ఆర్‌ఆర్‌ఆర్ సినిమా. ప్రపంచం మెచ్చిన హాలీవుడ్ పాటలను వెనక్కు నెడుతూ నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు అందుకుంది. నాటునాటకు ఆస్కార్ అనౌన్స్ చేయగానే ప్రేక్షకులు ఎగిరి గంతేశారు. మరి ఆ సినిమా కోసం ఎంతో కష్టపడ్డ ఆర్‌ఆర్‌ఆర్ చిత్రయూనిట్ రియాక్షన్ ఇంకెలా ఉంటుందో ఆలోచించారా? నాటునాటుకు అవార్డు ప్రకటించగానే జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ సంతోషంతో ఒకరినొకరు హత్తుకున్నారు.
ఈ విజయానికి పునాది వేసిన రాజమౌళి వైపు ఆనందంగా చూస్తూ కళ్లతోనే అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ విజయాన్ని గురించి రామ్‌చరణ్ సోషల్ మీడియాలో మాట్లాడుతూ.. 'మనం గెలిచాం. మన ఇండియన్ సినిమా గెలిచింది. యావత్ దేశమే గెలిచింది. ఆస్కార్‌ను ఇంటికి తెచ్చేస్తున్నాం' అని రాసుకొచ్చాడు.
'భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఆర్‌ఆర్‌ఆర్ ఎంతో ప్రత్యేకమైనది. ఆస్కార్ సొంతమయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నేనింకా కలలోనే ఉన్నట్లనిపిస్తోంది. రాజమౌళి, కీరవాణి గారు భారత చలనచిత్రపరిశ్రమలో ఉన్న అరుదైన రత్నాలు. ఈ అద్భుత కళాఖండంలో నన్ను భాగం చేసినందుకు ధన్యవాదాలు. నాటు నాటు అనేది ఒక భావోద్వేగం. ఆ ఎమోషన్‌కు ఒక రూపమిచ్చిన చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, ప్రేమ్ రక్షిత్‌లకు ధన్యవాదాలు. నా బ్రదర్ తారక్ థాంక్యూ.. కుదిరితే నీతో మళ్లీ డ్యాన్స్ చేసి రికార్డులు సృష్టించాలనుంది. ప్రియమైన కోస్టార్ ఆలియా భట్‌కు కూడా కృతజ్ఞతలు. ఈ అవార్డు భారతీయ నటీనటులందరికీ, సాంకేతిక నిపుణులకు సొంతం. మమ్మల్ని ఆదరించిన అభిమానులకు ప్రేమాభివందనాలు' అని ఓ లేఖలో రాసుకొచ్చాడు చరణ్.
We have won!!
We have won as Indian Cinema!!
We won as a country!!
The Oscar Award is coming home!@ssrajamouli @mmkeeravaani @tarak9999 @boselyricist @DOPSenthilKumar @Rahulsipligunj @kaalabhairava7 #PremRakshith @ssk1122 pic.twitter.com/x8ZYtpOTDN— Ram Charan (@AlwaysRamCharan) March 13, 2023
And we did it… #Oscars95 #NaatuNaatu #RRRMovie
Congratulations @mmkeeravaani Sir ji, Jakkanna @ssrajamouli , @boselyricist garu, the entire team and the nation 🇮🇳 pic.twitter.com/LCGRUN4iSs
— Jr NTR (@tarak9999) March 13, 2023
మరిన్ని వార్తలు :
మరిన్ని వార్తలు