Allu Arjun: ఒక రోజు లేట్‌గా బన్నీ ట్వీట్‌.. ఫ్యాన్స్‌ ఫిదా.. నెటిజన్స్‌ ఫైర్‌!

Allu Arjun Gets Trolled For Late Tweet On Oscars 2023 For RRR Natu Natu Song - Sakshi

ఇండియన్ మూవీ ఆస్కార్ సాధించడం అనేది ఓ కల. ఆ కలను ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీతో రాజమౌళి నెరవేర్చాడు. విశ్వవేదిక అకాడమీ అవార్డ్స్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ గా ఆర్‌ఆర్‌ఆర్‌ లోని నాటు నాటు పాట ఆస్కార్ దక్కించుకుంది. ఒక ఇండియన్‌ సినిమా ఆస్కార్ బరిలో నామినేషన్‌ లో ఉండటమే కాకుండా...అవార్డ్ సైతం గెలుచుకుంది. ఈ విషయాన్ని హాలీవుడ్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి. ఇక రాజమౌళి టీమ్ చరిత్ర సృష్టించటమే కాదు..దేశానికి ప్రతిష్టాత్మకమైన అవార్డ్ సాధించి పెట్టిందని టీటౌన్‌ సంబరాలతో మోత మోగిపోయింది.

టాలీవుడ్ అగ్రహీరోలతో పాటు..యంగ్ హీరోలందరూ సోమవారమే ట్వీటర్‌ వేదికగా ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్ కు విషెస్‌ తెలిపారు. కానీ అల్లు అర్జున్‌ మాత్రం ఒక్క రోజు ఆలస్యంగా ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్ కు విషెస్‌  చెప్పారు. ఇండియన్ సినిమాకు ఇది హార్ట్ టచింగ్ మూమెంట్ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. అలాగే  రామ్ చరణ్ ను లవ్లీ బ్రదర్ అంటూ... ఎన్టీఆర్ తెలుగు ప్రజల గర్వకారణం అని పేర్కొన్నారు. వాళ్ళిద్దరూ తమ స్టెప్పులతో ప్రపంచమంతా డ్యాన్స్ చేసేలా చేశారని పోస్టులో రాసుకొచ్చాడు. అలాగే ఈ మేజిక్ క్రియేట్ చేసిన రాజమౌళి కి  అల్లు అర్జున్ అభినందనలు తెలియజేశారు.

ప్రస్తుతం  అల్లు అర్జున్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఒక తెలుగు సినిమాకు ఆస్కార్‌ వస్తే.. ఇంత ఆలస్యంగా ట్వీట్‌ చేస్తారా? అని కొంతమంది నెటిజన్స్‌ బన్నీపై ఫైర్‌ అవుతుంటే.. షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల బన్నీ లేట్‌గా స్పందించి ఉంటారని ఫ్యాన్స్‌ చెబుతున్నారు. అంతేకాదు బన్నిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. రాంచరణ్‌ను గ్లోబల్ స్టార్ అంటూ.. అలాగే ఎన్టీఆర్‌ను తెలుగు ప్రైడ్ అంటూ ప్రశంసించడంపై ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top