Junior NTR: ఆస్కార్ వేడుక.. ఆ విషయంలో రామ్‌ చరణ్‌ను దాటేసిన ఎన్టీఆర్

Junior NTR Will Be The First Place in Social Media In Oscar Ceremony - Sakshi

‍అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన 95వ ఆస్కార్‌ అవార్డుల వేడుక ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది టాలీవుడ్ మూవీ ఆర్‌ఆర్ఆర్‌. మరో డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ అవార్డులు దక్కించుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఈ వేడును దాదాపు 18.7 మిలియన్ల  మంది వీక్షించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈవెంట్‌ను లైవ్‌ ఇచ్చిన ఏబీసీ ఈ విషయాన్ని వెల్లడించింది.

అయితే గతేడాదితో ఆస్కార్‌తో పోలిస్తే దాదాపు 12 శాతం ఆడియన్స్ పెరిగినట్లు సమాచారం. గతేడాది 16.6 మిలియన్ల మంది ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించారు. అయితే గతంలో జరిగిన కొన్ని వేడుకలతో పోలిస్తే ఇది తక్కువేనని అంటున్నారు. ఇటీవల ఆస్కార్ వేడుకలు వీక్షించే వారి సంఖ్య తగ్గిపోతుండటంతో విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో గతంలో నేషనల్‌ ఫుట్‌ బాల్‌ లీగ్‌ తర్వాత అత్యధిక మంది చూసే కార్యక్రమంగా ఆస్కార్ నిలిచింది. 

ఎన్టీఆర్ నంబర్‌ వన్

ఆస్కార్‌ అవార్డుల వేడుక సందర్భంగా సోషల్‌ మీడియాతో పాటు ఇతర మీడియాల్లో అత్యధికంగా ప్రస్తావించిన నటుల జాబితా (టాప్‌ మేల్‌ మెన్షన్స్‌)లో విభాగంలో జూనియర్ ఎన్టీఆర్‌ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచారని సోషల్‌మీడియాను విశ్లేషించే నెట్‌బేస్‌ క్విడ్‌ తెలిపింది. ఆయన తర్వాత మెగా హీరో రామ్‌చరణ్‌ ఉన్నారని వెల్లడించింది. ఆ తర్వాత ఉత్తమ సహనటుడిగా అవార్డు దక్కించుకున్న ‘ఎవ్రీథింగ్‌’ నటుడు కె హుయ్‌ ఖ్యాన్‌,  ఉత్తమ నటుడు బ్రెండన్‌ ఫ్రేజర్‌ (ది వేల్‌), అమెరికన్‌ యాక్టర్‌ పెడ్రో పాస్కల్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచారు.

టాప్‌లో ఆర్ఆర్ఆర్

అలాగే అత్యధిక సార్లు ప్రస్తావించిన సినిమాగానూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిలిచిందని తెలిపింది. ఆ తర్వాత ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌, ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌, ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్ట్రన్‌ ఫ్రంట్‌, అర్జెంటీనియా 1985 చిత్రాలు ఉన్నాయి. ఇక హీరోయిన్ల విషయానికొస్తే, మిషెల్‌ యో, లేడీ గాగా, ఏంజిలా బస్సెట్‌, ఎలిజిబెత్‌ ఓల్సెన్‌, జైమి లీ కర్టిస్‌లు వరుసగా ఐదుస్థానాల్లో నిలిచారు. 

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top