Oscar Awards 2023: ఆస్కార్‌ వేదికపై ఆర్‌ఆర్‌ఆర్‌ను బాలీవుడ్‌ ఫిలిం చేశారు!

Oscars 2023: Fans Slammed Jimmy Kimmel For His Called RRR A Bollywood Film During The Oscars 2023 Monologue - Sakshi

ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణాలివి.. నాటు నాటు ప్రజల మనసులు దోచుకుంటూ ఆస్కార్‌ను అందిపుచ్చుకుంది. దీంతో భారత ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఆస్కార్‌ వేదికపై ఓ పొరపాటు జరిగింది. తెలుగువాడైన జక్కన్న చెక్కిన తెలుగు సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ను బాలీవుడ్‌ చిత్రంగా అభివర్ణించాడు హోస్ట్‌ జిమ్మీ కిమ్మెల్‌. ఇది అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది.

ఇది అచ్చమైన స్వచ్చమైన తెలుగు చిత్రమని, బాలీవుడ్‌ మూవీ కాదంటూ రాజమౌళే ఎన్నోసార్లు నొక్కి చెప్పాడు. అలాంటిది ఇప్పుడు అంత పెద్ద అవార్డుల ఫంక్షన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ను బాలీవుడ్‌ అనేశారేంటి! అని నెటిజన్లు మండిపడుతున్నారు. 'ఇండియా అనగానే బాలీవుడ్‌ ఒక్కటే కాదు ఎన్నో భాషల ఇండస్ట్రీలు ఉన్నాయి. బాలీవుడ్‌ అంటే హిందీ పరిశ్రమ. ఇండియాలో చాలామంది హిందీ మాట్లాడతారు.. అలా అని అన్ని సినిమాలను బాలీవుడ్‌ అనలేం కదా.. ఆర్‌ఆర్‌ఆర్‌ తెలుగు భాషా చిత్రం. ఇది దక్షిణాదిలోని ఓ ఇండస్ట్రీ..', 'ఆస్కార్‌ అవార్డుల ఫంక్షన్‌ను హోస్ట్‌ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా' అని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top