లేదంటే మాటొచ్చేత్తది!  | Sakshi
Sakshi News home page

లేదంటే మాటొచ్చేత్తది! 

Published Sat, Dec 16 2023 12:19 AM

Naa Saami Ranga Allari Naresh Character Anji Intro Glimpse Released From Nagarjuna Movie  - Sakshi

అంజిగా మారిపోయారు ‘అల్లరి’ నరేశ్‌. నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథన్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇందులోని కీలకమైన అంజి పాత్రను ‘అల్లరి’ నరేశ్‌ చేస్తున్నారు. శుక్రవారం ‘అల్లరి’ నరేశ్‌ పాత్ర అంజిని గురించిన గ్లింప్స్‌ వీడియోను రిలీజ్‌ చేశారు.

‘‘మా అల్లరి అంజిగాడ్ని పరిచయం చేస్తున్నాం. లేదంటే మాటొచ్చేత్తది’’ అంటూ ‘అంజి’ గ్లింప్స్‌ వీడియోను షేర్‌ చేశారు నాగార్జున. ‘‘చేసేయ్‌.. చేసేయ్‌.. లేదంటే మాటొచ్చేత్తది’’ అనే డైలాగ్‌ చెప్పారు ‘అల్లరి’ నరేశ్‌. పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement