
బప్పీలహరి
బాలీవుడ్ సినీసెలబ్రీటీలు కరోనా బారిన పడటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే హిందీ చిత్రసీమకు చెందిన దాదాపు 12 మంది సినీ ప్రముఖులకు ఇటీవల కరోనా సోకగా తాజాగా ప్రముఖ సంగీత దర్శకులు బప్పీలహరి కరోనా బారినపడ్డారు. ‘‘కొంతకాలంగా అనారోగ్యంతో బప్పీలహరి బాధపడుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను ముంబయ్‌లోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో జాయిన్ చేశాం. కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడిచిన పదిహేను రోజుల్లో ఆయన్ను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సినందిగా బప్పీలహరి కోరుతున్నారు’’’ అని బప్పీలహరి మీడియా ప్రతినిధి పేర్కొన్నారు.