కలర్‌ ఫొటో దర్శకుడి కొత్త సినిమా 'ముఖచిత్రం' టీజర్‌ | Mukhachitram Teaser Out Now | Sakshi
Sakshi News home page

Mukhachitram: ముఖచిత్రం టీజర్‌ చూశారా?

Feb 11 2022 8:40 AM | Updated on Feb 11 2022 8:40 AM

Mukhachitram Teaser Out Now - Sakshi

‘‘టీజర్‌లో కొంతే చూపించాం. సినిమా ఇంతకు వంద రెట్లు ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు గంగాధర్‌. ‘‘ఓ బలమైన అంశాన్ని ఎంచుకుని సందీప్‌ రాజ్‌ కథ రాశాడు. ఇది డిఫరెంట్‌ మూవీ అవుతుంది’’ అన్నారు ఎస్‌కేఎన్‌.

వికాస్‌ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్యా రావ్, అయేషా ఖాన్‌ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ముఖచిత్రం’. ఎస్‌కేఎన్‌ సమర్పణలో ప్రదీప్‌ యాదవ్, మోహన్‌ యల్ల నిర్మించిన ఈ చిత్రానికి గంగాధర్‌ దర్శకుడు. గురువారం జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రం టీజర్‌ను హీరో విశ్వక్‌ సేన్‌ విడుదల చేశారు.

‘‘నిర్మాణంలో మాకు అనుభవం లేకపోయినా మా టీమ్‌ అర్థం చేసుకుని సినిమాని పూర్తి చేశారు’’ అన్నారు ప్రదీప్‌. ‘‘టీజర్‌లో కొంతే చూపించాం. సినిమా ఇంతకు వంద రెట్లు ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు గంగాధర్‌. ‘‘ఓ బలమైన అంశాన్ని ఎంచుకుని సందీప్‌ రాజ్‌ కథ రాశాడు. ఇది డిఫరెంట్‌ మూవీ అవుతుంది’’ అన్నారు ఎస్‌కేఎన్‌. ‘కలర్‌ ఫొటో’ దర్శకుడు సందీప్‌ రాజ్‌ కథ, స్క్రీన్‌ ప్లే, మాటలు అందించిన ఈ చిత్రానికి సంగీతం: కాల భైరవ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement