కలిసొచ్చిన మహేశ్ బాబు వాయిస్‌.. కోట్లు కొల్లగొట్టిన 'ముఫాసా' | Mufasa The Lion King First Week Collections | Sakshi
Sakshi News home page

కలిసొచ్చిన మహేశ్ బాబు వాయిస్‌.. కోట్లు కొల్లగొట్టిన 'ముఫాసా'

Dec 27 2024 1:53 PM | Updated on Dec 27 2024 3:23 PM

Mufasa The Lion King First Week Collections

హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ ఫిల్మ్‌ ‘ది లయన్‌ కింగ్‌ (2019)’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ అనే చిత్రం  రూపొందిన సంగతి తెలిసిందే. బారీ జెంకిన్స్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వాల్ట్‌ డిస్నీ పిక్చర్స్‌ పతాకంపై అడెలె రోమన్‌ స్కీ, మార్క్‌ సెరియాక్‌ ఈ సినిమాను నిర్మించారు. డిసెంబరు 20న విడుదలైన ఈ సినిమా మొదటి వారంలో భారీ కలెక్షన్స్‌ రాబట్టింది. ఒక పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా మొదటివారం రూ.74 కోట్లు వసూలు చేసినట్లు ప్రకటించారు.

ఇంగ్లిష్‌, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో  విడుదలైంది ఈ చిత్రం. మొదటి వారంలో దేశవ్యాప్తంగా ఇంగ్లిష్‌ వర్షన్‌లో రూ.26.75 కోట్లు, హిందీ  రూ.11.2కోట్లు, తెలుగు, రూ.11.3 కోట్లు కలెక్షన్స్‌ సొంతం చేసుకుంది. అయితే, ప్రపంవ్యాప్తంగా రూ. 74 కోట్లు రాబట్టింది.  ఇందులో టైటిల్‌ రోల్‌కు టాలీవుడ్‌ స్టార్‌ హీరో మహేశ్‌బాబు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది.  ఆపై  హిందీ వెర్షన్‌లో ముఫాసా పాత్రకు షారుక్‌ ఖాన్‌, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన కుమారుడు అబ్రం వాయిస్‌  అందించారు. ఈ చిత్రంలోని  సింబా పాత్రకు షారుక్‌ పెద్ద కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ వాయిస్‌ ఇవ్వడం విశేషం.

ముఫాసా చిత్రానికి ఇతర దేశాల్లో కాస్త ఆదరణ తక్కువగా ఉన్నప్పటికీ ఇండియాలో మాత్రం అదరగొడుతుంది. ఈ సినిమా కోసం దాదాపు రూ. 1750 కోట్ల వరకు బడ్జెట్‌ పెట్టారు. అయితే, మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. రూ. 1700 కోట్ల వరకు కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement