Mrunal Thakur: సీతారామం రిజల్ట్‌.. డైరెక్టర్‌ను పట్టుకొని ఏడ్చేసిన హీరోయిన్‌

Mrunal Thakur Gets Emotional After Seeing Sita Ramam Movie - Sakshi

దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం​ 'సీతారామం'. హ‌నురాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం నేడు(శుక్రవారం)విడుద‌లై హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది.క్లాసిక్‌ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. విజువల్స్, కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్‌ సహా హీరో,హీరోయిన్ల కెమిస్ట్రీకి కూడా మంచి మార్కులు పడ్డాయి.

ఆడియెన్స్‌ నుంచి ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్‌ రావడంతో హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌  డైరెక్టర్‌ను గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది. తనకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు దర్శకుడికి మృణాల్‌ కృతజ్ఞతలు తెలిపింది. ఇక హీరో దుల్కర్‌ సైతం సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ను చూసి ఒకింత ఎమోషనల్‌ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top