Mrunal Thakur Posted Blue Bikini Pics on social media - Sakshi
Sakshi News home page

Mrunal Thakur: నీ నుంచి ఇలాంటిది ఊహించలేదు.. మృణాల్ బికినీ షూట్‌పై కామెంట్స్!

Apr 4 2023 9:08 PM | Updated on Apr 5 2023 11:22 AM

Mrunal Thakur bold bikini photos leave fans disappointed - Sakshi

సీతారామం సినిమాతో స్టార్ డమ్ సంపాదించుకున్న బ్యూటీ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసినా.. సీతారామంతోనే క్రేజ్ తెచ్చుకుంది. మొదటి బుల్లితెరపై మెప్పించిన నటి ఆ తర్వాతే సినిమాల్లో అడుగుపెట్టింది. సీతారామం తర్వాత ఆమె అందానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే తాజాగా మృణాల్ తన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఫోటోలు వైరలవుతున్నాయి. బ్లూ బికినీలో ఉన్న పిక్స్ కుర్రకారు మతిపొగేట్టేలా ఉన్నాయి. ప్రస్తుతం వేకేషన్‌లో ఉన్న స్టన్నింగ్ భామ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. 

ఇన్‌స్టాగ్రామ్‌లో మృణాల్ ఫోటోలు చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అభిమానులు ప్రశంసలతో ముంచెత్తగా.. సీతా రామం చిత్రంలోని ఆమె సీత పాత్రను ప్రస్తావిస్తూ.. ఓ నెటిజెన్ "RIP సీతా మహాలక్ష్మి" అంటూ కామెంట్స్ చేశారు. మరో నెటిజన్ 'సీతా మహాలక్ష్మి మరింత హీట్ పుట్టిస్తోంది' అంటూ పోస్ట్ చేశారు. మీరు బికినీలో కంటే చీరలోనే చాలా అందంగా ఉన్నారంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మీకు ఏమైంది మేడమ్..  మీ నుంచి ఇలాంటివి మేం ఆశించడం లేదు. మా హృదయాలను విచ్ఛిన్నం చేశారంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.

మృణాల్ ఠాకూర్ ప్రాజెక్ట్‌లు

కాగా.. మృణాల్ ఇటీవల 'సెల్ఫీ'లో అక్షయ్ కుమార్ సరసన 'కుడియే నీ తేరి వైబ్' అనే ప్రత్యేక సాంగ్‌లో కనిపించారు.  దుల్కర్ సల్మాన్ నటించిన పాన్-ఇండియా మూవీ 'సీతా రామం'లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. మృణాల్ ప్రస్తుతం ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి 'గుమ్రా'లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7న సినిమాల్లో విడుదల కానుంది. నటి ఇషాన్ ఖట్టర్‌తో 'పిప్పా' కూడా వరుసలో ఉంది. 

Advertisement
 
Advertisement
Advertisement