Mehboob Dilse Buys XUV700 Luxury Car - Sakshi
Sakshi News home page

Mehaboob Dilse: ఈద్‌ స్పెషల్‌.. కొత్త కారు ఇంటికి తెచ్చుకున్న మెహబూబ్‌

Apr 23 2023 2:11 PM | Updated on Apr 23 2023 2:38 PM

Mehboob Dilse Buys XUV700 Luxury Car - Sakshi

ఈద్‌ పండగ సందర్భంగా తనకు ఇష్టమైన ఎస్‌యూవీ 700 కారును ఇంటికి తెచ్చుకున్నాడు. బ్లాక్‌ కలర్‌లో మెరిసిపోతున్న కారు ముందు దిగిన ఫోటోలను మెహబూబ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు

గుంటూరు మిర్చి లాంటి కుర్రోడు, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మెహబూబ్‌ దిల్‌సే కొత్త కారు కొన్నాడు. ఈద్‌ పండగ సందర్భంగా మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారును ఇంటికి తెచ్చుకున్నాడు. దీని ధర రూ.15 లక్షల పైనే ఉంటుందని తెలుస్తోంది. బ్లాక్‌ కలర్‌లో మెరిసిపోతున్న కారు ముందు దిగిన ఫోటోలను మెహబూబ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు.

ఇది చూసిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు సోహైల్‌, శ్రీరామచంద్ర, కాజల్, అర్జున్‌ కల్యాణ్‌, రవికృష్ణ తదితరులు అతడికి శుభాకాంక్షలు చెప్తున్నారు. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి అన్నా అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. రంజాన్‌ మాసం కావడంతో తన స్నేహితులకు ఇఫ్తార్‌ పార్టీ కూడా ఇచ్చాడు మెహబూబ్‌.

కాగా మెహబూబ్‌ టిక్‌టాక్‌ వీడియోలు, వెబ్‌ సిరీస్‌లతో పాపులర్‌ అయ్యాడు. బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌తో అతడికి కావాల్సినంత గుర్తింపు లభించింది. బిగ్‌బాస్‌ 4 గ్రాండ్‌ ఫినాలే వేదికగా చిరంజీవి అందించిన పది లక్షల రూపాయలకు తోడు తను సంపాదించిన డబ్బులను జత చేసి గుంటూరులో సొంతిల్లు కట్టుకున్నాడు. నిత్యం యూట్యూబ్‌ వీడియోలు, వెబ్‌ సిరీస్‌లతో మెహబూబ్‌ తన అభిమానులను ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు.

చదవండి: సినిమా హిట్‌.. థియేటర్‌కు వెళ్లిన దర్శకుడికి షాక్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement