Virupaksha Director Karthik Dandu Mobile Phone Theft in Theatre - Sakshi
Sakshi News home page

విరూపాక్ష రెస్పాన్స్‌ చూద్దామని థియేటర్‌కు వెళ్లిన దర్శకుడికి షాక్‌!

Apr 23 2023 1:21 PM | Updated on Apr 23 2023 2:16 PM

Virupaksha Director Karthik Dandu Mobile Phone Theft in Theatre - Sakshi

సినిమా చూస్తున్నంతసేపు బాగానే ఉంది కానీ బయటకు వచ్చాక చూసుకుంటే జేబులో మొబైల్‌ ఫోన్‌ కనిపించకుండా పోయింది. థియేటర్‌లో ఉన్నప్పుడు ఎవరో ఆయన ఫో

చాలా కాలం తర్వాత విరూపాక్షతో హిట్‌ అందుకున్నాడు సాయిధరమ్‌ తేజ్‌. ఏప్రిల్‌ 21న విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.24.60 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్‌ సుకుమార్‌ స్క్రీన్‌ప్లే అందించగా ఆయన శిష్యుడు కార్తీక్‌ వర్మ దండు దర్శకత్వం వహించాడు. థియేటర్‌కు వచ్చినవాళ్లను భయపెట్టడంలో సక్సెస్‌ అయ్యాడు డైరెక్టర్‌. ఈ సినిమాపై అటు సినీప్రేమికులు, ఇటు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తుండటంతో చిత్రయూనిట్‌ సంబరాలు చేసుకుంటోంది.

ఒక్కసారి ప్రేక్షకుల స్పందన ఎలా ఉందామో నేరుగా చూద్దామని కార్తీక్‌ వర్మ, నిర్మాత బాపినీడుతో కలిసి సరదాగా థియేటర్‌కు వెళ్లాడు. తన సినిమాను స్క్రీన్‌పై చూసుకుని మురిసిపోయాడు డైరెక్టర్‌. సినిమా చూస్తున్నంతసేపు బాగానే ఉంది కానీ బయటకు వచ్చాక చూసుకుంటే జేబులో మొబైల్‌ ఫోన్‌ కనిపించకుండా పోయింది. థియేటర్‌లో ఉన్నప్పుడు ఎవరో ఆయన ఫోన్‌ కొట్టేశారు. ఈ విషయాన్ని కార్తీక్‌ వర్మే స్వయంగా వెల్లడించాడు. సినిమా హిట్టయింది కానీ ఫోన్‌ పోయిందని చెప్పుకొచ్చాడు. 

విరూపాక్ష విషయానికి వస్తే.. ఈ చిత్రంలో సంయుక్త మీనన్‌ కథానాయికగా నటించగా రాజీవ్‌​ కనకాల, సునీల్‌, సాయిచంద్‌, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలు పోషించారు. కాంతార ఫేమ్‌ అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందించాడు.

చదవండి: ప్రియురాలి ఆత్మహత్య.. మూడేళ్ల తర్వాత నటితో నటుడి లవ్‌ మ్యారేజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement