మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరెకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికీ ఈ మూవీ రిలీజ్ తేదీపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. దీంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ టాక్ వైరలవుతోంది. ఈ సినిమా రిలీజ్ తేదీని లాక్ చేశారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ ఫాంటసీ సినిమాను దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారని సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ 16న విశ్వంభర థియేటర్లలో సందడి చేయనుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటనైతే రావాల్సి ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మించారు.


