Chiranjeevi-Sukumar: Megastar Chiranjeevi To Act In Sukumar Direction, Deets Inside - Sakshi
Sakshi News home page

Chiranjeevi-Sukumar: సుకుమార్ డైరెక్షన్‌లో నటించనున్న మెగాస్టార్‌ చిరంజీవి

Feb 22 2022 11:39 PM | Updated on Apr 14 2022 1:01 PM

Megastar Chiranjeevi to act in Sukumar direction - Sakshi

Sukumar Directs Megastar Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్‌ 29న రిలీజ్‌కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తొలిసారిగా పూర్తి స్థాయిలో తన తనయుడు రామ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక దాంతో పాటు మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్‌, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ షూటింగ్‌లతో ఫుల్‌ బిజీగా ఉన్నారు మెగాస్టార్‌.

వీటితో పాటు బాబీతో ఓ సినిమా వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజా విషయం ఏంటంటే.. సుకుమార్‌ దర్శకత్వంలో కూడా నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు చిరంజీవి. అయితే అది సినిమాకు కాదు. చాలా కాలం తరువాత మెగాస్టార్‌ ఓ కమర్షియల్‌ యాడ్‌లో కన్పించనున్నారు. అయితే ఆ యాడ్‌ను సుకుమార్ డైరెక్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. అలా సుకుమార్ డైరెక‌్షెన్‌లో చిరంజీవి నటించనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి చిరంజీవితో దిగిన ఓ ఫోటోను సుకుమార్ అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement