ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్‌తో వస్తున్న తొలి ఇండియన్‌ మూవీ ‘మయూఖం’ | Mayukham Movie Pooja Ceremony | Sakshi
Sakshi News home page

ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్‌తో వస్తున్న తొలి ఇండియన్‌ మూవీ ‘మయూఖం’

Aug 29 2025 6:12 PM | Updated on Aug 29 2025 6:12 PM

Mayukham Movie Pooja Ceremony

వంద శాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో వస్తున్న తొలి ఇండియన్ మూవీగా "మయూఖం" అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి టీ సిరీస్ మ్యూజిక్ నుంచి ప్రియాంక మన్యాల్ క్లాప్ నివ్వగా, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుల సంఘం ప్రెసిడెంట్ వీర శంకర్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మూవీ టీమ్ కు  బెస్ట్ విషెస్ అందించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకట్ బులెమోని మాట్లాడుతూ -మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఆరేళ్లుగా కష్టపడి ఈ స్క్రిప్ట్ రెడీ చేశాను. దీన్నొక ఫ్రాంఛైజీలా, ఒక యూనివర్స్ లా క్రియేట్ చేయబోతున్నాం. వందశాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో వస్తున్న తొలి ఇండియన్ మూవీ ఇదే. బాలీవుడ్ లో 60శాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ తో గతంలో "తాల్" అనే మూవీ చేశారు. హాలీవుడ్ లో ఈ పద్ధతిలో మూవీస్ చేస్తుంటారు. మా సినిమాలో వందశాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ చేసినా ఏ బ్రాండ్ కూడా మీకు ప్రోమోట్ చేసినట్లుగా కనిపించదు. హిస్టారికల్, మైథలాజికల్ అంశాలతో వాస్తవాల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. అన్నారు.

హీరో కుశ్ లవ్ మాట్లాడుతూ - "మయూఖం" చిత్రంతో నా లైఫ్ లో మరో ఫేజ్ లోకి ఎంటర్ అవుతున్నా. డైరెక్టర్ వెంకట్ ఎంత హార్డ్ వర్కర్ అనేది నాకు తెలుసు. ఈ చిత్రంలో బిజినెస్ పరంగానే కాదు టెక్నికల్ గా కూడా కొత్తగా ప్రయత్నిస్తున్నాం. మీ అందరికీ మా పర్ ఫార్మెన్స్ నచ్చుతుంది, మా సినిమాను మీరంతా ప్రేమిస్తారని నమ్ముతున్నాం. మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అన్నారు.  

హీరోయిన్ తన్మయి మాట్లాడుతూ - "మయూఖం" సినిమాలో హీరోయిన్ గా నేను పర్పెక్ట్ గా సెట్ అవుతానని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వెంకట్ గారికి థ్యాంక్స్. నా గత చిత్రాల్లాగే ఈ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ లభించింది. మీ అందరినీ థియేటర్స్ లో కలుసుకునేందుకు వెయిట్ చేస్తున్నా. "మయూఖం" చిత్రాన్ని మీరంతా సపోర్ట్ చేయండి. అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement