ఓటీటీలో పొలిటికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. ఉచితంగానే చూసేయండి | Rajkummar Rao’s Gangster Drama Maalik Now Streaming Free on Amazon Prime from September 5 | Sakshi
Sakshi News home page

ఓటీటీలో పొలిటికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌.. ఉచితంగానే చూసేయండి

Aug 29 2025 4:01 PM | Updated on Aug 29 2025 4:08 PM

Rajkummar rao movie Maalik ott streaming details

బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావ్‌ కీలక పాత్రలో నటించిన గ్యాంగ్‌స్టర్‌ డ్రామా చిత్రం ‘మాలిక్‌’ (Maalik). గతేడాది స్త్రీ-2తో సూపర్ హిట్ కొట్టిన నటుడు.. ఇటీవల  భూల్ చుక్ మాఫ్ అనే మూవీతో ప్రేక్షకులను పలరించారు. ఈ క్రమంలోనే జులై 11న మాలిక్‌ చిత్రం విడుదలైంది. అయితే, ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దర్శకుడు పుల్కిత్‌ తెరకెక్కించిన ఈ మూవీలో మానుషి చిల్లర్‌ కథానాయికగా నటించారు.

మాలిక్‌ చిత్రం ఇప్పటికే అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే, సెప్టెంబర్‌ 5 నుంచి ఎలాంటి అద్దె చెల్లించకుండా ఈ చిత్రాన్ని చూడొచ్చని ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. అమెజాన్‌ చందాదారుల ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా ఈ మూవీని చూడొచ్చు.  పొలిటికల్‌ క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం కొన్ని వర్గాలను అయితే మెప్పించింది. 1988లో ‍అలహాబాద్‌లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు. రాజ్‌కుమార్‌ రావు గ్యాంగ్‌స్టర్‌గా మెప్పించిన ఈ చిత్రాన్ని  టిప్స్ ఫిల్మ్స్, నార్తర్న్ లైట్స్ ఫిల్మ్స్‌ బ్యానర్లపై కుమార్ తౌరానీ, జే షెవాక్రమణి నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement