ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ దర్శకురాలు కన్నుమూత

Marathi Director And Writer Sumitra Bhave Lost Breath at 78 - Sakshi

సాక్షి, ముంబై: చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. మరాఠీ సినిమా ఇండస్ట్రీ ముఖాన్నే మార్చేసిన దర్శకురాలు, నిర్మాత సుమిత్ర భవే(78) తుదిశ్వాస విడిచింది. వృద్దాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె కొద్దిరోజులుగా పుణెలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ప్రాణాలు విడిచింది. 

సునీల్‌ సుక్తాంకర్‌తో కలిసి పని చేసిన సుమిత్ర తనదైన చిత్రాలతో మరాఠీ ఇండస్ట్రీని కొత్త దారిలో నడిపించింది. వీళ్లిద్దరి కలయికలో దాదాపు 50కి పైగా లఘుచిత్రాలు, నాలుగు టీవీ సీరియళ్లు, 17 సినిమాలు వచ్చాయి. వీటన్నింటికీ సుమిత్ర భవే రచయితగా పని చేసింది. సునీల్‌ సుక్తాంకర్‌ నటుడిగా, పాటల రచయితగానూ గుర్తింపు పొందాడు.

సుమిత్ర సినిమాల్లో 90 పైచిలుకు పాటలను స్వయంగా ఈయనే రచించాడు. సినీ ఇండస్ట్రీకి అందించిన సేవలకు గానూ వీరికి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. 2016లో వారు తీసిన కాసవ్‌ సినిమాకు ప్రతిష్టాత్మక గోల్డెన్‌ లోటస్‌ నేషనల్‌ అవార్డు వచ్చింది.

చదవండి: హైదరాబాద్‌ రోడ్ల మీద జూ.ఎన్టీఆర్‌ చక్కర్లు

వివేక్‌ మృతి పట్ల ప్రముఖుల సంతాపం

బుట్టబొమ్మ ఇంట్లో బర్త్‌డే వేడుకలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top