breaking news
director and writer
-
విషాదం: లెజెండరీ దర్శకురాలు మృతి
సాక్షి, ముంబై: చిత్రపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. మరాఠీ సినిమా ఇండస్ట్రీ ముఖాన్నే మార్చేసిన దర్శకురాలు, నిర్మాత సుమిత్ర భవే(78) తుదిశ్వాస విడిచింది. వృద్దాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె కొద్దిరోజులుగా పుణెలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ప్రాణాలు విడిచింది. సునీల్ సుక్తాంకర్‌తో కలిసి పని చేసిన సుమిత్ర తనదైన చిత్రాలతో మరాఠీ ఇండస్ట్రీని కొత్త దారిలో నడిపించింది. వీళ్లిద్దరి కలయికలో దాదాపు 50కి పైగా లఘుచిత్రాలు, నాలుగు టీవీ సీరియళ్లు, 17 సినిమాలు వచ్చాయి. వీటన్నింటికీ సుమిత్ర భవే రచయితగా పని చేసింది. సునీల్ సుక్తాంకర్ నటుడిగా, పాటల రచయితగానూ గుర్తింపు పొందాడు. సుమిత్ర సినిమాల్లో 90 పైచిలుకు పాటలను స్వయంగా ఈయనే రచించాడు. సినీ ఇండస్ట్రీకి అందించిన సేవలకు గానూ వీరికి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. 2016లో వారు తీసిన కాసవ్ సినిమాకు ప్రతిష్టాత్మక గోల్డెన్ లోటస్ నేషనల్ అవార్డు వచ్చింది. చదవండి: హైదరాబాద్ రోడ్ల మీద జూ.ఎన్టీఆర్ చక్కర్లు వివేక్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం బుట్టబొమ్మ ఇంట్లో బర్త్‌డే వేడుకలు -
విధితో పోరాడిన చక్రవర్తి
‘జగదేక వీరుడు- అతిలోక సుందరి ’... చిరంజీవి కెరీర్లోనే ఓ మైల్స్టోన్. ఈ సినిమాకు మూల కథా రచయిత ఎవరో కొద్దిమందికే తెలుసు. ఆయనే శ్రీనివాస చక్రవర్తి. రచయితగా, దర్శకుడిగా ఒక దశలో చక్రవర్తిలానే బతికారాయన. కట్ చేస్తే- కాలం రాసిన స్క్రీన్‌ప్లేకి ఆయన లైఫ్ క్లైమాక్స్ మొత్తం కడు విషాదమయమైపోయింది. హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్లో అనామకంగా కన్ను మూయాల్సి వచ్చింది. గత పది రోజులుగా పచ్చకామెర్ల వ్యాధితో పోరాడుతూ సోమవారం ఉదయం ఆయన కన్ను మూశారు. ఒక రచయిత జీవితం ఇలా ముగిసిపోవడం నిజంగా విషాదమే. ఏలూరుకు చెందిన శ్రీనివాస చక్రవర్తి అప్పట్లో రాజ్‌కపూర్ తీసిన ‘బాబీ’ చిత్రంతో అసిస్టెంట్ డెరైక్టర్‌గా తన కెరీర్ మొదలుపెట్టారు. కేయస్ ప్రకాశరావు, కమలాకర కామేశ్వరరావు, బాపు, విజయనిర్మల తదితర హేమాహేమీల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. ‘ఎంగళ్ వాద్యార్’ అనే తమిళ సినిమాతో కథా రచయితగా కొత్త అవతారం ఎత్తారు. ‘అనురాగ బంధం’, ‘చుట్టాలబ్బాయ్’, ‘అనాదిగా ఆడది’, ‘పుణ్య దంపతులు’, ‘జగదేక వీరుడు- అతిలోక సుందరి’, ‘పెళ్లి’ తదితర చిత్రాలకు రచన చేసింది ఆయనే. మలయాళంలో ‘పతివ్రత’ లాంటి సినిమాలు డెరైక్ట్ చేశారు. ఒకప్పటి మలయాళ నాయిక పద్మప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకో కుమార్తె. పద్మప్రియ ఆకస్మిక మరణం, కూతురి అనారోగ్య సమస్యలు ఆయన్ను బాగా కుంగదీసాయి. చక్రవర్తిలా బతికిన వాడు చిన్న హాస్టల్లో అనామకుడిలా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా కూడా విధిపై ఒంటరి పోరాటం చేయడానికి ప్రయత్నించారు. ‘జగదేక వీరుడు-అతిలోక సుందరి’కి సీక్వెల్ కథ సిద్ధం చేశాననీ, తన దగ్గర మరో పది స్క్రిప్టులు ఉన్నాయనీ అనేక సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. చివరి క్షణం వరకూ కథల గురించి ఆలోచిస్తూ ఓ కథగా మిగిలిపోయారాయన. కోడి రామకృష్ణ తీసిన సూపర్‌హిట్ ‘పెళ్ళి’ చిత్రానికి కథ శ్రీనివాస చక్రవర్తి అయితే, మాటలు జి. సత్యమూర్తి. విధి రాసిన వింత స్క్రిప్ట్ ఏమిటంటే... ఈ రచయితలు ఇద్దరూ ఒకే రోజు చనిపోవడం.