హీరోగా కాంట్రవర్సీ నటుడు మన్సూర్.. అలాంటి సినిమాలో | Mansoor Ali Khan Sarakku Movie Release And Public Talk, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Mansoor Ali Khan Sarakku: హీరోగా కాంట్రవర్సీ నటుడు మన్సూర్.. అలాంటి సినిమాలో

Published Sat, Dec 30 2023 8:51 AM

Mansoor Ali Khan Sarakku Movie Release And Public Talk - Sakshi

నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ పేరు ఈ మధ్య తెగ వినిపించింది. విలన్‌ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. నిజ జీవితంలోనూ విలన్‌గా ప్రవర్తించాడు. 'లియో' మూవీలో ఓ సీన్‌లో హీరోయిన్ త్రిషని మానభంగం చేయాలని ఉందని మైండ్ పోయే కామెంట్స్ చేశాడు. ఈ మాటల వల్ల కోర్టు, కేసులని గొడవ చాలా దూరం పోయింది. ప్రస్తుతం దాని గురించి అందరూ మర్చిపోయారు. అయితే మన్సూర్ హీరోగా నటించిన ఓ సినిమా తాజాగా రిలీజైంది.

(ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ మాజీ భర్తపై దాడి చేసిన యువకుడు)

సరక్కు పేరుతో తమిళంలో మాత్రమే రిలీజైన ఈ సినిమాలో మన్సూర్‌ అలీఖాన్‌ న్యాయవాదిగా నటించాడు. మద్యానికి బానిసై, డబ్బు కోసం అందరినీ మోసం చేస్తూ, కుటుంబాన్ని కూడా సరిగా పట్టించుకోని వ్యక్తి పాత్రలో మన్సూర్ నటించాడు. ఇది చూస్తే మన్సూర్ నిజ జీవిత పాత్రలా అనిపించింది పలువురు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మన్సూర్ హీరో కావడం, మద్యం కాన్సెప్ట్ మూవీ కావడంతో ఇది కాస్త ఆసక్తికరంగా అనిపించింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన ఆ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

Advertisement
Advertisement