Manoj Bajpayee Takes an Auto Ride in Jodhpur, Watch Video - Sakshi
Sakshi News home page

Manoj Bajpayee: లాస్ట్‌డే షూటింగ్‌.. ఆటోలో వెళ్లిన నటుడు, వీడియో వైరల్‌

Oct 27 2022 4:59 PM | Updated on Oct 27 2022 5:56 PM

Manoj Bajpayee Takes an Auto Ride in Jodhpur, Watch Video - Sakshi

జోధ్‌పూర్‌లో చివరి షూటింగ్‌.. రిక్షాలో తిరుగుతూ ఈ రిచ్‌ సిటీ గొప్పతనాన్ని చూపిస్తున్నాం. మమ్మల్ని ఆహ్వానించినందుకు సోలంకిగారికి ధన్యవాదాలు. జోధ్‌పూర్‌లో గొప్ప ఆతిథ్యాన్నిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు. త్వరలో మళ్లీ వస్తాను అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు.

ఫ్యామిలీ మ్యాన్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే అతడు రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌ షూటింగ్‌ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అక్కడి ఆటోలో ప్రయాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అతడు తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. 'జోధ్‌పూర్‌లో చివరి షూటింగ్‌.. రిక్షాలో తిరుగుతూ ఈ రిచ్‌ సిటీ గొప్పతనాన్ని ఆస్వాదిస్తున్నాం. మమ్మల్ని ఆహ్వానించిన సోలంకిగారికి ధన్యవాదాలు. జోధ్‌పూర్‌లో గొప్ప ఆతిథ్యాన్నిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు. త్వరలో మళ్లీ వస్తాను' అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు.

ఇకపోతే ప్రస్తుతం అతడు చేస్తున్న సినిమా కథ గురించి మనోజ్‌ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'వినోద్‌ భన్సాలీ, సుపర్ణ్‌ ఎస్‌ వర్మ నాకు కథ చెప్పినప్పుడు వెంటనే ఓకే చెప్పాను. కోర్ట్‌ రూమ్‌ డ్రామా జనాలకు ఎంతగానో నచ్చుతుంది. డైరెక్టర్‌ అపూర్వ్‌ కార్కి సినిమాను అద్బుతంగా తెరకెక్కిస్తున్నాడు. ఇది తప్పకుండా అందరి మనసుల్లో నిలిచిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది' అన్నాడు. కాగా మనోజ్‌ త్వరలో సూప్‌ అనే వెబ్‌ షోలో కనిపించనున్నాడు. అలాగే డిస్పాచ్‌ అనే థ్రిల్లర్‌ చిత్రంలోనూ నటిస్తున్నాడు.

చదవండి: విజయ్‌ రిలేషన్‌షిప్‌పై జాన్వీ కపూర్‌ ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌
కలిసిపోయిన 'సునయ', కెప్టెన్‌ ఎవరంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement