20 ఏళ్ల తర్వాత కలిసిన 'మన్మథుడు' జోడీ.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్! | Sakshi
Sakshi News home page

Anshu: నాగార్జున సర్‌ ఏం మారలే.. ఆ రెండూ ఇప్పటికీ అలానే!

Published Mon, Mar 4 2024 2:35 PM

Manmadhudu Heroine Anshu Reunite With Nagarjuna - Sakshi

తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాల్లో 'మన్మథుడు' ఒకటి. నాగార్జున, సోనాలి బింద్రే, బ్రహ్మానందం, త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్.. ఇలా ఒకరిని మించి మరొకరు ఈ మూవీకి బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. కల్ట్ క్లాసిక్ మూవీగా నిలబెట్టారు. ఇప్పుడు ఈ మూవీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే.. 'మన్మథుడు'లో ఓ హీరోయిన్‌గా చేసిన అన్షు.. ఇప్పుడు నాగార్జునని కలిసింది. ఇంట్రెస్టింగ్ పోస్ట్ కూడా పెట్టింది.

(ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే)

2002లో వచ్చిన 'మన్మథుడు' సినిమాలో హీరోగా నాగార్జున ఎంత అందంగా కనిపిస్తారో.. హీరోయిన్లుగా చేసిన సోనాలి బింద్రే, అన్షు కూడా అంతే అందంగా కనిపిస్తారు. అయితే ఈ మూవీ చేసిన తర్వాత అన్షు.. మరో రెండు తెలుగు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత పూర్తిగా నటనకు దూరమైపోయింది. పెళ్లి చేసుకుని ఇంగ్లాండ్‌లో సెటిలైపోయింది. దాదాపు 20-21 ఏళ్ల తర్వాత భారత్ తిరిగొచ్చిన అన్షు.. ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. నాగార్జునతో కలిసి పార్టీ కూడా చేసుకుంది.

రీసెంట్‌గా 'మన్మథుడు' జోడీ నాగార్జున-అన్షు కలిసి పార్టీ చేసుకున్నారు. పలు ఫొటోలు బయకొచ్చాయి. తాజాగా ఇప్పుడు నాగార్జునని కలవడం గురించి స్వయంగా హీరోయిన్ అన్షునే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. 'ఔదర్యం, మంచిగా ఉండటం అనేవి నాగ్ సర్‌లో మరింతగా పెరిగాయి. ఈ జ్ఞాపకాలు మరింత పదిలంగా ఉంటాయి' అని అన్షు రాసుకొచ్చింది. ఇప్పుడు ఫొటోలు అభిమానులకు తెగ నచ్చేస్తున్నాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?)

 
Advertisement
 
Advertisement