కుక్కను చంపేశారు.. భోరున ఏడ్చేసిన హీరోయిన్‌ (వీడియో) | Manjari Fadnis Alleges Society Dog Mikey Was Hit With Rod | Sakshi
Sakshi News home page

కుక్కను చంపేశారు.. భోరున ఏడ్చేసిన హీరోయిన్‌

Jun 9 2026 2:02 PM | Updated on Jun 9 2026 2:14 PM

Manjari Fadnis Alleges Society Dog Mikey Was Hit With Rod

తాను ఎంతో ప్రేమగా చూసుకునే కుక్కను దారణంగా కొట్టి చంపారంటూ నటి మంజరి ఫడ్నిస్‌ భోరున ఏడ్చేశారు. 2019 నుంచి ఆ కుక్క తన అపార్ట్‌మెంట్‌లోనే ఉండేదని.. సొసైటీకి చెందిన ఓ వ్యక్తి అత్యంత కీరాతకంగా దాన్ని కొట్టి చంపేశాడని ఆమె ఆరోపించింది. 

మంజరి ఫడ్నిస్ తెలిపిన వివరాల ప్రకారం.. 2019లో ఒక కుటుంబం వదిలేసి వెళ్లిన ఓ కుక్కను సొసైటీ సభ్యులు చేరదీశారు. దానికి ‘మైకీ’ అని పేరు పెట్టి సొసైటీలోనే పెంచుకుంటున్నారు. మంజరి కూడా దానికి స్నానం చేయించడం, గ్రూమింగ్ చూసుకోవడం లాంటివి చేసేవారు. అయితే కొన్ని రోజుల క్రితం మైకీ కనిపించకుండా పోయింది. పోస్టర్లు వేయించి వెతికినా కూడా దొరకలేదు. బేస్‌మెంట్ ఏరియాలో మైకీ ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో, సోసైటీకి చెందిన ఓ వ్యక్తి దారుణంగా కొట్టి చంపేశాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ మంజరి ఎమోషనల్‌ అయ్యారు. భవిష్యత్తులో ఇలా ఎవరూ జంతుహింసకు పాల్పడకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని  విజ్ఞప్తి చేశారు.

 ప్రస్తుతం మంజరి వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. హీరోయిన్లు  భూమి పెడ్నేకర్, వేదిక, డింపుల్ హయతి సహా పలువురు నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జంతు క్రూరత్వ నిరోధక చట్టం కింద దోషులను కఠినంగా శిక్షించాలంటూ మంజరికి మద్దతుగా నిలుస్తున్నారు. కాగా, మంజరి ఫడ్నిస్ తెలుగులో సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం, శుభప్రదం, జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement