Manchu Vishnu: మా భవనంపై త్వరలోనే ప్రకటన, తిరుపతిలో స్టూడియో..

Manchu Vishnu Sensational Comments About Maa Association: హీరో మంచు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మన్యం రాజు మూవీ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా త్వరలోనే మా అసోసియేషన్ తరపున మా భవనం గురించి మీడియా సమావేశం నిర్వహిస్తామన్నారు. మోహన్‌బాబు నాయకత్వంలో తిరుపతిలో స్టూడియో ఏర్పాటు గురించి త్వరలోనే ప్రకటన చేస్తారని పేర్కొన్నారు.
'నూతన నటీనటులు , సాంకేతిక సిబ్బందిని ప్రోత్సాహిస్తాం. సినిమా టికెట్స్ ధరలు విషయం లో ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. వ్యక్తిగతంగా నా అభిప్రాయం చెప్పడం సరికాదు. లెజెండరీ నటులు చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు,నాగార్జున, వెంకటేష్ మాకు ఆదర్శం.
దాసరి నారాయణరావు వై.ఎస్ రాజశేఖర రెడ్డి రెడ్డి సీఎంగా ఉన్నపుడు సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేసి జీవో తెచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు నలుగురి కోసం ఆ జీవో మార్చారు. దీనిపై చర్చ జరగాలి' అని విష్ణు సంచలన కామెంట్స్ చేశారు.