Manchu Vishnu: ఫిల్మ్‌ చాంబర్‌ బిల్డింగ్‌ కూల్చేసి కొత్తది కట్టిస్తా!

Manchu Vishnu About MAA Membership - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మా ఎన్నికల్లో తాను చేసిన వాగ్దానాలు 90 శాతం పూర్తయ్యాయన్నాడు మా అధ్యక్షుడు మంచు విష్ణు. సంక్రాంతి తర్వాత మా కోసం యాప్‌ తీసుకొస్తామని, నటీనటుల అవకాశాల కోసం ప్రత్యేక బుక్‌లెట్‌ తయారుచేశామని చెప్పాడు. మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తైన సందర్భంగా మంచు విష్ణు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమానికి మోహన్‌బాబు ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. '2021 మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. అక్టోబర్‌ 13న నేను మా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నాను. నేను ఎలక్షన్స్‌లో పోటీ చేసినప్పుడు సినీపరిశ్రమలో ఎంతో అలజడి నెలకొంది. నేను మా అసోసియేషన్‌కే కాదు ప్రేక్షకులకు కూడా జవాబుదారీనే! మా అసోసియేషన్‌లో 20 శాతం మంది నటులు కాని సభ్యులున్నారు. మా అసోసియేషన్‌ సభ్యత్వం కఠినంగా ఉండేలా తుది నిర్ణయం తీసుకున్నాం. నటీనటులు కనీసం రెండు చిత్రాల్లో నటించి, అవి విడుదలైతేనే వారికి మాలో శాశ్వత సభ్యత్వం ఉంటుంది.

కనీసం ఐదు నిమిషాలైనా సినిమాలో కనిపించి డైలాగ్‌ చెప్పిన వాళ్లకు అసోసియేట్‌ సభ్యత్వం కల్పిస్తాం. అసోసియేట్‌ సభ్యులకు మాలో ఓటు హక్కు లేదు. మా అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఎవరైనా నటీనటులు, కార్యవర్గ సభ్యులు ధర్నాలు చేసినా, మీడియాకు వెళ్లినా వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తాం. ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే మా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుంది. అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా వారు పోటీకి అనర్హులవుతారు. మా అసోసియేషన్ భవనానికి రెండు ప్రతిపాదనలు సూచించాను. ఫిల్మ్ నగర్‌కు అరగంట దూరంలో ఓ భవనం నిర్మిస్తున్నాం. ఇప్పుడున్న ఫిల్మ్ ఛాంబర్ భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం కట్టేందుకు నేను ఖర్చు భరిస్తాను. చాలా మంది సభ్యులు రెండో అంశానికే మద్దతు పలికారు' అని చెప్పాడు.

చదవండి: ఆరోహి పోయిందంటే ఇనయను తగులుకున్నాడు
సినిమా ఛాన్స్‌ అని ఇంటికి పిలిచి.. : నటి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top