Manchu Mohan Babu Tweet On Ysr Birth Anniversary- Sakshi
Sakshi News home page

YSR Jayanthi: పేద ప్రజల దైవం మా బావగారు: మోహన్‌బాబు

Jul 8 2021 10:27 AM | Updated on Jul 8 2021 12:52 PM

Manchu Mohan Babu Tweet On YSR Birth Anniversary - Sakshi

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం మహానేత జయంతిని పురస్కరించుకుని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటున్నారు. మరికొంతమంది సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా రాజన్నకు నివాళులర్పిస్తున్నారు.

‘స్నేహశీలీ, రాజఠీవి, రాజకీయ దురంధరుడు, మాట తప్పడు మడమ తిప్పడు అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం,పేద ప్రజల దైవం మా బావగారైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నేడు. బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మశాంతి కలగాలని ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటున్నాను’ అని సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబు ట్వీట్‌ చేశారు. టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌, రచయిత కోన వెంకట్‌, దర్శకుడు గోపిచంద్‌ మలినేని ట్విటర్‌ వేదికగా వైఎస్సార్‌కు నివాళులర్పించారు. 

Advertisement
 
Advertisement
Advertisement