Manchu Manoj: నన్ను నడిపించిన నాన్నకు జన్మదిన శుభాకాంక్షలు: మనోజ్

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఇటీవలే ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నారు. కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో మంచు లక్ష‍్మీ ప్రసన్న స్వగృహంలో పెళ్లి వేడుక జరిగింది. తాజాగా మార్చి 19న తన తండ్రి మోహన్ బాబు బర్త్ డే సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మనోజ్ తన పెళ్లిలో మౌనికను ఆశీర్వదిస్తున్న ఫోటోను పంచుకున్నారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది.
మనోజ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నడక నుండి నా నడవడిక వరకు నన్ను నడిపించిన నాన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నాన్నా... లవ్ యూ...!' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఆయన అభిమానులు మోహన్ బాబుకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
మరిన్ని వార్తలు :
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు