14 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన మామా మశ్చీంద్ర.. అక్కడే స్ట్రీమింగ్‌! | Mama Mascheendra Streaming On This Two OTT Platforms | Sakshi
Sakshi News home page

Mama Mascheendra Movie: థియేటర్‌లో రిలీజైన రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన మామా మశ్చీంద్ర.. రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్‌

Published Fri, Oct 20 2023 1:20 PM | Last Updated on Fri, Oct 20 2023 1:40 PM

Mama Mascheendra Streaming On This Two OTT Platforms - Sakshi

టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు త్రిపాత్రాభినయం చేసిన చిత్రం మామా మశ్చీంద్ర. మృణాలినీ రవి, ఈషా రెబ్బ హీరోయిన్లుగా నటించారు. హర్షవర్దన్‌ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు నిర్మించారు.  అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ ముఖ్య పాత్రలు పోషించగా చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు.

అక్టోబర్‌ 6న థియేటర్లలో విడుదలైన చిత్రం జనాలను ఆకర్షించడంతో విఫలమైంది. దీంతో రెండువారాలకే బాక్సాఫీస్‌ దగ్గర తట్టాబుట్టా సర్దేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్‌లో సినిమా విడుదలైన  14 రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది. అమెజాన్‌ ప్రైమ్‌తో పాటు ఆహాలోనూ మామా మశ్చీంద్ర అందుబాటులో ఉంది. 

సినిమా కథేంటంటే?
సుధీర్‌.. పరశురామ్‌, దుర్గ, డీజే అనే మూడు పాత్రల్లో నటించాడు. పరశురామ్‌కు స్వార్థమెక్కువ. వందల కోట్ల ఆస్తి కోసం సొంత చెల్లి కుటుంబాన్ని చంపేందుకు కుట్ర పన్నుతాడు. కానీ వాళ్లు బతికిపోతారు. పరశురామ్‌ కూతురు విశాలాక్షి(ఈషా రెబ్బ), పరశురామ్‌ దగ్గర పనిచేసే దాసు కూతురు మీనాక్షి(మృణాళిని రవి).. దుర్గ, డీజే అనే కుర్రాళ్లతో లవ్‌లో పడతారు. వీళ్లిద్దరూ పరశురామ్‌ పోలికలతో ఉండటంతో వాళ్లు తన మేనల్లుళే అని పరశురామ్‌కు నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ముగ్గురి ప్రేమకు మంచి ముగింపు పడిందా? లేదా? అనేది ఓటీటీలో చూసేయండి..

చదవండి: లియో ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎన్ని వందల కోట్లంటే? ఏ ఓటీటీలోకి రానుందంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement