డైరెక్ట్‌గా ఓటీటీ స్టార్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Mohanlal Malaikottai Vaaliban (Telugu) Movie Direct Streaming On This OTT Platform - Sakshi
Sakshi News home page

Mohanlal: డైరెక్ట్‌గా ఓటీటీ మోహన్ లాల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Wed, Feb 14 2024 11:19 AM

Malayalam Star Hero Latest Movie Direct Streaming In Ott In Telugu - Sakshi

మలయాళ స్టార్ మోహన్‌లాల్  నటించిన చిత్రం తాజా చిత్రం మలైకొట్టై వాలిబన్. ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకొచ్చంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. లిజో జోస్ పెల్లిస్సేరీ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని షాకిచ్చింది. మోహ‌న్‌లాల్‌, లిజో  కాంబోలో వచ్చిన చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ డిజాస్టర్‌గా నిలిచింది. మోహన్‌లాల్‌ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం రూ.25 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే థియేట‌ర్ల‌లో ఈ మూవీ కేవ‌లం మ‌ల‌యాళం భాషలో మాత్ర‌మే రిలీజైంది.

అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్‌గా మారింది. ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలోనే రిలీజ్‌కు మేకర్స్‌ నిర్ణయించినట్లు సమాచారం. మార్చి 1 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో ఈ  హిస్టారిక‌ల్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశముందని లేటేస్ట్ టాక్. 

దాదాపు రూ.65 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రంలో.. మోహన్ లాల్ రాజస్థాన్‌కు చెందిన రెజ్లర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో డ్యుయల్‌ రోల్‌లో ఆకట్టుకున్నారు.  బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హీరోయిన్‌గా నటించింది. మోహ‌న్ లాల్ కెరీర్‌లో మ‌ల‌యాళంలో అత్య‌ధిక న‌ష్టాల‌ను మిగిల్చిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది, కాగా.. గతేడాది జైలర్, నేరు సినిమాలతో అలరించిన మోహన్‌ లాల్.. ప్రస్తుతం బరోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement