సూపర్‌ హిట్‌ సినిమా అరుదైన ఘనత.. తొలి భారతీయ చిత్రంగా రికార్డ్! | Malayalam Block Buster Drishyam Movie Series Remake In Hollywood, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Drishyam Hollywood Remake: దృశ్యం సినిమా అరుదైన రికార్డ్.. ఆ విషయంలో తొలి భారతీయ సినిమాగా!

Published Thu, Feb 29 2024 1:41 PM

Malayalam Block Buster Drishyam Movie series Remake in Hollywood - Sakshi

మలయాళ బ్లాక్ బస్టర్ దృశ్యం మూవీకి అరుదైన ఘనత దక్కింది. ఈ సినిమాను హాలీవుడ్‌లో రీమేక్‌ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ హాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ ఇంగ్లిష్‌, స్పానిష్‌లలో తెరకెక్కించన్నట్లు ప్రకటించింది. దీంతో హాలీవుడ్‌లో రీమేక్‌ కానున్న మొదటి భారతీయ చిత్రంగా దృశ్యం నిలవనుంది. 

ఈ చిత్రాన్ని మోహన్‌ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్‌ తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం-2 కూడా సక్సెస్‌ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ నటించగా.. భారీ హిట్‌ను సొంతం చేసుకుంది.   హిందీలో అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో కమల్‌ హాసన్‌, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. 

ఇప్పటికే దృశ్యం సిరీస్ చిత్రాలను కొరియన్‌లో రీమేక్‌ చేశారు. అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా హాలీవుడ్‌కు చెందిన  గల్ఫ్‌ స్ట్రీమ్ పిక్చర్స్‌, మరో నిర్మాణ సంస్థతో కలిసి దృశ్యం సినిమాలను‌ ప్రేక్షకులకు అందించనుంది. ఇండియన్‌ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్‌ నుంచి అంతర్జాతీయ రీమేక్‌ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. దీంతో హలీవుడ్ దృశ్యంలో నటీనటులుగా ఎవరు కనిపించనున్నారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. కాగా.. త్వరలోనే మలయాళంలో దృశ్యం 3 రానుంది.

 
Advertisement
 
Advertisement