పెళ్లయ్యాక కూడా ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నా.. 18 ఏళ్లపాటు ఆ ఎఫైర్ నడిపాను అంటున్నాడు మలయాళ సీనియర్ నటుడు జనార్ధనన్. అంతేకాదు, ఈ ఎఫైర్ గురించి తన భార్యక్కూడా తెలుసని చెప్తున్నాడు. మలయాళంలో ఎక్కువగా కామెడీ, విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన జనార్ధనన్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు.
18 ఏళ్లపాటు మరో మహిళతో ఎఫైర్
ఈ సందర్భంగా జనార్ధనన్ (Actor Janardhanan) మాట్లాడుతూ.. నేను వివాహేతర సంబంధం పెట్టుకున్నాను. 18 ఏళ్ల క్రితం ఓ మహిళతో రిలేషన్ కొనసాగించాను. తనకోసం నేను చాలా చేశాను. ఇవన్నీ నా భార్యకూ తెలుసు. తనకు కొన్ని విషయాల్లో ఆసక్తి తగ్గిపోయింది. అందుకే నేను ఇంకో అమ్మాయిని చూసుకున్నాను. నేనూ మనిషినే కదా! 18 ఏళ్లపాటు తనతో సంబంధం కొనసాగించాను.
ఏ తప్పూ చేయలేదు
కానీ, ఆమె ఈ సమాజానికి భయపడి సడన్‌గా నన్ను దూరం పెట్టేసింది. నా జీవితంలో ఇదొక్కటే చెడుమరకగా మిగిలిపోయింది. ఇది కాకుండా నేనింకే తప్పూ చేయలేదు. పైగా దీనివల్ల నా కుటుంబంలోని ఎవరూ ఇబ్బందులకు గురికాలేదు. ఈ వయసులో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నేను కోల్పోవడానికంటూ ఏమీ లేదు. నా భార్య విషయానికి వస్తే తను చాలా మంచిది. చాలా బాగా వండిపెట్టేది అని చెప్పుకొచ్చాడు.
సినిమా
జనార్ధనన్ బంధువులమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి తనకు తెలిసిన విజయలక్ష్మి అనే అమ్మాయిని వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు కూతుర్లు జన్మించారు. ఒరు సీబీఐ డైరీ కురిప్పు, మెలపరంబిల్ ఆన్వీడు, మన్నార్ మఠై, 2018 వంటి పలు మలయాళ సినిమాల్లో నటించాడు. నాగేంద్రాస్ హనీమూన్ వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేశాడు. చివరగా మోహన్‌లాల్ హృదయపూర్వంలో కనిపించాడు.
చదవండి: ఏం మాట్లాడాలి? దివ్యపై భరణి ఉగ్రరూపం.. కప్పు తనూజదే!


