Malavika Mohanan Strong Reply On Intimate Scene - Sakshi
Sakshi News home page

Malavika Mohanan: బెడ్‌ సీన్‌ గురించి నెటిజన్ ప్రశ్న.. ఘాటుగా హీరోయిన్‌ రిప్లై

May 22 2022 9:31 PM | Updated on May 23 2022 9:00 AM

Malavika Mohanan Strong Reply On Intimate Scene - Sakshi

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.యు. మోహనన్‌ కుమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీఫుల్‌ హీరోయిన్‌ మాళవిక మోహనన్‌. తమిళంలో సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ 'పెట్టా', విజయ్‌ హీరోగా నటించిన 'మాస్టర్‌' సినిమాలతో అలరించింది.

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.యు. మోహనన్‌ కుమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటీఫుల్‌ హీరోయిన్‌ మాళవిక మోహనన్‌. తమిళంలో సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ 'పెట్టా', విజయ్‌ హీరోగా నటించిన 'మాస్టర్‌' సినిమాలతో అలరించింది. ఇటీవల ధనుష్‌ కలిసి నటించిన 'మారన్‌' ఓటీటీలో విడుదలైంది. కానీ అంతగా విజయం సాధించలేదు. ఈ మూవీలో పలు ఇంటిమేట్ సీన్లలో యాక్ట్‌ చేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాళవిక ఇటీవల 'క్వశ్చన్ అండ్ ఆన్సర్' సెషన్ నిర్వహించింది. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. 

ఈ క్రమంలోనే ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే ఆన్సర్‌ ఇచ్చింది మాళవిక. 'మారన్‌ సినిమాలోని బెడ్‌ సీన్‌ కోసం ఎన్నిసార్లు షూట్‌ చేశారు' అని అడిగిన ప్రశ్నకు మాళవిక స్పందిస్తూ 'నీ తలలో ఏదో పాడైనట్టుంది' అని ఘాటుగా సమాధానం ఇచ్చింది. మాళవిక మోహనన్‌ ఇచ్చిన ఈ రిప్లై ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇటీవల విజయ్ దేవరకొండతో రొమాంటిక్‌ సినిమా చేయాలనుందని సోషల్ మీడియా వేదికగా మాళవిక చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఆమె సిద్ధాంత్‌ చతుర్వేది, రాఘవ్ జుయాల్‌తో కలిసి 'యుధ్రా' సినిమాలో నటిస్తోంది. 

చదవండి: విజయ్‌ దేవరకొండతో రొమాంటిక్ మూవీ చేయాలనుంది: హీరోయిన్




Advertisement
 
Advertisement
Advertisement