Divyansha Kaushik : 'ఐ లవ్‌ నాగచైతన్య.. చూడటానికి చాలా బాగుంటాడు'.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Majili Beauty Divyansha Kaushik Reacts To Dating Rumours With Naga Chaitanya - Sakshi

సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి తరుచూ గాసిప్స్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. శోభిత దూళిపాళతో చై డేటింగ్‌ రూమర్స్‌ అప్పట్లో ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఆ మధ్య మజిలీ బ్యూటీ దివ్యాంశ కౌశిక్‌తోనూ చై ప్రేమలో ఉన్నాడని జోరుగా ప్రచారం జరిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే టాక్‌ వినిపించింది.

అంతేకాదు మజిలీ తర్వాత రామారావు ఆన్‌ డ్యూటీ సినిమాలో దివ్యాంశకు హీరోయిన్‌గా ఛాన్స్‌ రావడానికి కూడా నాగ చైతన్యనే కారణమని, ఆయనే దివ్యాంశ పేరును రికమెండ్‌ చేసినట్లు గుసగుసలు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్‌పై స్వయంగా దివ్యాంశ క్లారిటీ ఇచ్చింది.

రీసెంట్‌గా ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఐ లవ్‌ నాగచైతన్య. చూడటానికి చాలా బాగుంటాడు. అతనిపై నాకు క్రష్‌ ఉంది. కానీ మేం పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. రామారావు ఆన్‌ డ్యూటీలో నాకు ఛాన్స్‌ రావడానికి చై కారణమంటూ వచ్చిన రూమర్స్‌లో కూడా నిజం లేదు' అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top