మహేష్, భూమిక హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం | Mahesh, Bhumika New Film Shooting Begins | Sakshi
Sakshi News home page

మహేష్, భూమిక హీరో హీరోయిన్లుగా కొత్త చిత్రం

Dec 25 2022 3:52 PM | Updated on Dec 25 2022 3:55 PM

Mahesh, Bhumika New Film Shooting Begins - Sakshi

యువ నటులు మహేష్, భూమిక హీరో హీరోయిన్లుగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. సి.హెచ్ సుజాత నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంతో సజ్జా కుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గోల్డెన్ సినీ క్రియషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1 గా తెరకెక్కుతున్న ఈ చిత్రం  షూటింగ్  హైదరాబాద్ గోల్డెన్ టెంపుల్ లో ప్రారంభం అయింది.

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సుజాత మాట్లాడుతూ.. ‘మా బ్యానర్  గోల్డెన్ సినీ క్రియషన్స్ లో ప్రొడక్షన్ నెం.1 చిత్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. డైరక్టర్ కుమార్ చెప్పిన కథ నచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’అని అన్నారు. ‘మంచి సినిమా చేస్తాడని నిర్మాతలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకుంటాను’ అని దర్శకుడు కుమార్‌ అన్నారు. ‘ఈ సినిమాతో సుజాత, కుమార్‌లకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’అని సీనియర్ ప్రొడ్యూసర్ రామరాజు  అన్నారు. షూటింగ్‌ ప్రారంభోత్సవంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ శోభన్ బాబు, విలయిల్ ఫిలిప్స్ థామస్ పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement