అల్లు అర్జున్‌కి మహేశ్‌ బాబు థ్యాంక్స్‌.. చాలా హ్యాపీగా ఉందంటూ ట్వీట్‌

Mahesh babu Thanks To Allu Arjun For His Words On Major Movie - Sakshi

శశి కిరణ్‌ తిక్క దర్శకత్వంలో అడివిశేష్‌ హీరోగా నటించిన చిత్రం ‘మేజర్‌’. 26\ 11ముంబై దాడుదల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణణ్‌ జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. మహేశ్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్‌ ఏస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 3న విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రంపై ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

(చదవండి:  ప్రతి భారతీయుడి మనసును తాకే గొప్ప సినిమా: అల్లు అర్జున్‌)

ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునేలా సినిమా ఉందని, మ్యాన్‌ ఆఫ్‌ ద షో అడివిశేష్‌ వెండితెరపై మరోసారి మ్యాజిక్‌ చేశాడంటూ ‘మేజర్‌’టీమ్‌కు అభినందనలు తెలిపారు. గుండెల్ని పిండేసే సినిమాను అందించిన నిర్మాత మహేశ్‌బాబుగారికి ప్రత్యేక గౌరవాభినందనలు. ప్రతి భారతీయుడి గుండెను తాకే గొప్ప సినిమా మేజర్‌' అంటూ బన్నీ ట్వీట్‌ చేశాడు. తాజాగా బన్నీ ట్వీట్‌పై మహేశ్‌ బాబు స్పందించాడు.అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. ‘థ్యాంక్స్‌  అల్లు అర్జున్‌. మీ మాటలు మేజర్‌  టీమ్‌కు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ‘మేజర్‌’ మూవీ మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’అని మహేశ్‌ ట్వీట్‌ చేశాడు.ప్రస్తుతం మహేశ్‌ బాబు ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అయింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top