భలే ఉన్నావు బాబు | Mahesh Babu looks dapper in new viral picture | Sakshi
Sakshi News home page

భలే ఉన్నావు బాబు

Sep 11 2020 6:17 AM | Updated on Sep 11 2020 6:17 AM

Mahesh Babu looks dapper in new viral picture - Sakshi

సినిమా హీరోలు లుక్కు మారిస్తే చాలు ఫ్యాన్స్‌కి అదో కిక్కు. ప్రస్తుతం అలాంటి కిక్కే ఫ్యాన్స్‌కు అందించారు మహేశ్‌బాబు. ‘సర్కారు వారి పాట’ అనే సినిమాలో నటించనున్నారు మహేశ్‌. ఈ సినిమాలో కొత్త లుక్‌లో కనిపించనున్నారాయన. అందుకోసం జుట్టు పెంచుతున్నారు కూడా. బుధవారం ఓ యాడ్‌ షూట్‌లో పాల్గొన్నారు మహేశ్‌. అందులో భాగంగా ఓ ఫొటో బయటకు వచ్చింది. ఆ ఫొటోలో కొత్త లుక్‌లో కనిపించిన మహేశ్‌ని చూసి ఫ్యాన్స్‌ అందరూ ‘భలే ఉన్నావు బాబు’ అంటూ సోషల్‌ మీడియాలో సందడి చేశారు. అయితే ఇదే లుక్‌తో సినిమాలోనూ కనిపిస్తారా? ఇంకా డిఫరెంట్‌గా ఉంటుందా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌.

Advertisement
 
Advertisement
Advertisement