బిగ్‌బాస్ 7 ఫైనల్ అతిథిగా ఆ స్టార్ హీరో? వెరీ ఇంట్రెస్టింగ్! | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu Final: గెస్ట్ లేకుండా గత ఫైనల్.. ఈసారి మాత్రం అంతకు మించి!

Published Wed, Dec 13 2023 6:16 PM

Mahesh Babu Chief Guest For Bigg Boss 7 Telugu Finale Episode - Sakshi

బిగ్‌బాస్ 7వ సీజన్ గ్రాండ్ ఫినాలేకు మరికొన్ని రోజులే ఉంది. ఈ ఆదివారం చాలా గ్రాండ్‌గా ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నాడు. ఇప్పటికే చివరివారాన్ని నిర్వహకులు.. ఫుల్ పాజిటివ్ వైబ్స్‌ తీసుకొచ్చేశారు. ఎవరు విన్నర్ అవుతారా? అని ప్రేక్షకులు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఫైనల్‌కి రాబోయే గెస్ట్ ఎవరనే న్యూస్ బయటకొచ్చింది.

ఇప్పటివరకు 6 సీజన్లు పూర్తయ్యాయి. గతసారి చీఫ్ గెస్ట్ అంటూ ఎవరూ రాలేదు. దీంతో నాగార్జునే.. రేవంత్‌కి ట్రోఫీ అందజేశాడు. అంతకు ముందు పలు సీజన్ల ఫినాలేకు మాత్రం స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేశ్ వచ్చారు. అలా ఈసారి ఎవరైనా వస్తారా? అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు రాబోతున్నాడనే తియ్యటి వార్త.. అభిమానుల చెవుల్లో పడింది. ఇది నిజమైపోవాలని తెగ ఆరాటపడుతున్నారు.

(ఇదీ చదవండి: హీరో విజయ్ దేవరకొండపై అలాంటి వార్తలు.. ఆ వ్యక్తి అరెస్ట్)

అయితే ఫినాలే ఎపిసోడ్‌కి మహేశ్ రావడంలో పెద్ద విచిత్రం ఏం ఉండకపోవచ్చు. ఎందుకంటే మరో నెల రోజుల్లో అంటే సంక్రాంతి కానుకగా 'గుంటూరు కారం'.. థియేటర్లలోకి రాబోతుంది. బిగ్‌బాస్ షోకి మహేశ్ గెస్ట్‌గా వస్తే మాత్రం.. ప్రమోషన్ పరంగా మూవీకి కాస్త హెల్ప్ కావొచ్చు. దీనిబట్టి చూస్తే మహేశ్ రావడం గ్యారంటీనే అనిపిస్తోంది. మరో ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చేస్తుందిలే!

ఇకపోతే ఈసారి విన్నర్ అయ్యే సూచనలు అమర్-ప్రశాంత్‌లలో ఒకరికి ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఓట్లు అయితే వీరిద్దరికే ఎక్కువగా పడుతున్నట్లు తెలుస్తోంది. వీళ్లతో పాటు శివాజీ కూడా  ఉన్నాడు కానీ అతడిని విన్నర్ చేస్తారా అంటే సందేహంగానే కనిపిస్తుంది. మరి బిగ్‌బాస్ 7 విజేత.. వీళ్ల ముగ్గురిలో ఒకడా? లేదా అనుహ్యంగా కొత్త వ్యక్తి అవుతాడా అనేది ఆదివారం (డిసెంబరు 17) తేలిపోతుందిలే!

(ఇదీ చదవండి: బిగ్ బాస్ మిడ్‌ వీక్‌ ఎలిమినేషన్.. ఆ ముగ్గురిలో ఎవరు?)

Advertisement
 
Advertisement
 
Advertisement